టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన తాజా చిత్రం దేవర.( Devara ) కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ ఈనెల 27వ తేదీన విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టేశారు.
దేవర సినిమా కూడా అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టింది.ఇప్పటికే ఓవర్సీస్ లో కొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ కాగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
ముఖ్యంగా యూఎస్ఏ ప్రీమియర్ ప్రీ సేల్స్( USA Premiere Pre-Sales ) పరంగా దేవర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.దానికి తోడు ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్ ఒక్కొక్క అప్డేట్ ని విడుదల చేస్తూ ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతున్నారు.ఇకపోతే జానర్ తో సంబంధం లేకుండా యూఎస్ లో మంచి వసూళ్లు రాబట్టే హీరోలలో ఎన్టీఆర్ కూడా ఒకరు.ఇప్పుడు దేవర సినిమాతో అది మరొకసారి రుజువు అవుతోంది.
యూఎస్ఏ ప్రీమియర్ ప్రీ సేల్స్ లో ఇండియన్ సినిమాల పరంగా వేగంగా 15,000 టికెట్లు, 20,000 టికెట్లు, 25,000 టికెట్లు బుక్ అయిన సినిమాగా దేవర నిలిచింది.ఇక కలెక్షన్ల పరంగా ఇప్పటికే దాదాపు 800K డాలర్లు రాబట్టి, 1 మిలియన్ కి చేరువైంది.
ప్రీమియర్లకు 18 రోజుల ముందే దేవర ఈ ఫీట్ సాధించడం విశేషం.యూఎస్ లోనే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందంటే ఇక తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాక ఏ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దానికి తోడు ఎన్టీఆర్ నుంచి దాదాపు ఆరేళ్ల తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో ఈ సినిమాను మొదటి రోజు చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు.ఈ లెక్కన చూసుకుంటే దేవర.మూవీ మొదటిరోజే వరల్డ్ వైడ్ గా రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.