ఇటీవల కాలంలో చాలా వరకు సినిమాలను చూసిన తర్వాత ప్రేక్షకులు సినిమా నిడివి ఎక్కువ అయింది అన్న మాటలు ఎక్కువగా చెబుతున్నారు.దీంతో ఈ మాట ఇటీవల కాలంలో సినిమా దర్శక నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారిపోయిందని చెప్పాలి.
సినిమా నిడివి ఎక్కువగా ఉన్నప్పుడు ఏ సన్నీ వేశాన్ని కట్ చేయాలో తెలియక వారు తికమక పడుతూ ఉంటారు.కొన్ని భారీ సినిమాలు రెండున్నర నుంచి మూడు గంటల వరకు కూడా ఉంటాయి.
కానీ కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులు అంతసేపు కూర్చోడానికి అసలు ఇష్టపడరు.ఎక్కువ శాతం మంది రెండున్నర గంటలోపే సినిమా అయిపోవాలని చూస్తుంటారు.
ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాలలో సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) సినిమా కూడా నిడివి ఎక్కువే అన్న విషయం మనందరికీ తెలిసిందే.చాలా ఫుటేజ్ ను ఎడిట్ రూమ్ లోనే వదిలేసారని గుసగుసలు వున్నాయి.కాస్త పేరున్న దర్శకులు అంతా తమ చిత్తానికి సినిమా తీసేసి తరువాత ఎడిట్ రూమ్ లో వదిలేస్తున్నారు.దాని వల్ల నిర్మాతలకే కదా నష్టం.ఇకపోతే ఈ సంగతి అలా వుంచితే ఈ నెలలో రాబోతున్న దేవర సినిమా( Devara ) విషయంలో కూడా నిడివి మీద కసరత్తు మొదలైందని తెలుస్తోంది.దేవర కథ ఒక్క భాగంలో చెప్పడం కష్టం అని డిసైడ్ అయిన తరువాతే దర్శకుడు కొరటాల శివ( Koratala Siva ) రెండు భాగాలు చేసారు.
అందువల్ల నిజానికి నిడివి సమస్య రాకూడదు.
తొలిభాగాన్ని ఎక్కడ ముగించాలన్న క్లారిటీ వుండే వుంటుంది.పైగా పెద్దగా పాటలు లేవు.ఈ మధ్య వదిలిన పాటను కూడా తీసుకెళ్లి వర్కింగ్ టైటిళ్ల మీద పెట్టేసారు.
అలా ఒక అయిదు నిమషాలు నిడివి తగ్గినట్లే.దేవర సినిమా ఫైనల్ కట్ నిడివి తొలిభాగం మూడు గంటల పది నిమిషాల వరకు వచ్చిందని, దీనికి రెండు గంటల యాభై నిమిషాల మేరకు తగ్గించాయిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.
ఇది ఎంత వరకు నిజమో కానీ మూడు గంటల పది నిమిషాలను రెండు గంటల యాభై నిమిషాలు చేయడం అంటే కాస్త కష్టమైన టాస్క్ అనే చెప్పాలి.అయితే దర్శకుడు కొరటాల ఈ టాస్క్ ను ముగించాలంటే సులువైన మార్గం ఒకటే.
కొన్ని షాట్స్ ను రెండో భాగానికి మార్చడం.కానీ అలా చేయాలంటే కథలో జంప్ లు వచ్చే ప్రమాదం వుంది.
అలాంటివి వుండకుండా, నిడివి పెరగకుండా చూడడం అంటే అంత సులువైన పని కాదు.కొరటాల ఏం చేస్తారో చూడాలి మరి.ప్రస్తుతం ఈ వార్త అభిమానులను కూడా కాస్త కలవరపెడుతోంది.