దారుణం.. కన్న తల్లితండ్రులపై నడిరోడ్డులో చెప్పుతో దాడి చేసిన కొడుకు..
TeluguStop.com
ఈరోజుల్లో కొందరు వివాహాలు జరిగిన తర్వాత భార్యాపిల్లల కోసం తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను( Parents ) చిన్నచూపు చూస్తున్నారు.
వృద్ధులైన తల్లిదండ్రులు కూడా వృద్ధాశ్రమాలకు పంపే వారు కూడా ఉన్నారు.వారిలో తల్లిదండ్రులపై చేయిచేసే సాహసం చేసిన ఓ వ్యక్తి కూడా ఉన్నాడు.
నడిరోడ్డు మీద మార్గమధ్యలో తల్లి, తండ్రిని చెప్పుతో కొట్టి రాక్షసంగా ప్రవర్తించాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేరస్థుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. """/" /
కశ్మీర్ లోని శ్రీనగర్ లో( Srinagar ) ఓ కొడుకు( Son ) తల్లిదండ్రులపై బూటుతో దాడికి పాల్పడ్డాడు.
మహ్మద్ అష్రఫ్ వానీ అనే వ్యక్తి తన తల్లి బేగంపై, తండ్రి గులాం అహ్మద్ వానీపై మార్గమధ్యలో దారుణంగా దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్( Video Viral ) కావడంతో, మహ్మద్ అష్రఫ్ వానీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
నౌగావ్ పోలీస్ స్టేషన్లో అతనిపై సెక్షన్ 74, సెక్షన్ 126 (2), సెక్షన్ 351 (2) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
"""/" /
వైరల్ వీడియోలో, వీధి పక్కన నడుచుకుంటూ వెళుతున్న తల్లిదండ్రులను చూసిన మహ్మద్ అష్రఫ్ తన బైక్ ఆపి తల్లిదండ్రులను చెప్పులతో కొట్టాడు.
అనంతరం ఇద్దరు స్థానికులు వచ్చి కుమారుడి దారుణం నుంచి వృద్ధ తల్లిదండ్రులను కాపాడారు.
ఇక ఈ విడెన్ చూసిన నెటిజన్స్ అతడిపై మంది పడుతున్నారు.``ఈ భూమిపై ఇలాంటి పాపాత్ములైన పిల్లలు కూడా ఉన్నారా.
'' అని కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే.
వీడు కొడుకు కాదు.విడో సైతాన్ అని.
ఈ దుర్మార్గపు కొడుకును శిక్షించాలని కామెంట్ చేసారు.
అనిల్ రావిపూడి సూర్య కాంబినేషన్ లో సినిమా రాబోతుందా..?