యూట్యూబర్‌ను ఉగ్రవాదిగా అనుకున్న ప్రజలు.. పోలీసులకు ఫోన్.. చివరకు.?

రోజురోజుకి యూట్యూబ్ వ్లాగర్ల( Youtube Vlogger ) సంఖ్య పెరుగుతోంది.చాలా మంది డబ్బు సంపాదించడానికి యూట్యూబ్‌ను మంచి వేదికగా ఉపయోగిస్తున్నారు.

 Villagers Considered Youtube Vlogger As Terrorist Called Police Viral Video Deta-TeluguStop.com

ఎక్కడికెళ్లినా మొబైల్ ఫోన్ లేదా కెమెరా తీసుకుని వీడియో క్యాప్చర్ చేసి తమ యూట్యూబ్ లో షేర్ చేయడం కామన్ గా మారింది.అయితే, కొన్నిసార్లు వ్లాగర్ల ప్రవర్తన అడ్డంకికి దారితీస్తుందనడానికి తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఒక యువకుడు వ్లాగ్ చేయడానికి ఒక గ్రామానికి వచ్చినప్పుడు, అతని వెనుక బరువైన బ్యాగ్‌ని( Bag ) చూసి, గ్రామస్థులు అతన్ని ఉగ్రవాదిగా తప్పుగా భావించారు.వారు భయంతో పోలీసులకు కాల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సూరజ్ శర్మ( Suraj Sharma ) అనే వ్లాగర్ ఒక గ్రామాన్ని సందర్శించాడు.ఈ సందర్భంగా అతని వీపుపై బరువైన బ్యాగును చూసి గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు.

బ్యాగులో ఏముందో చూపించాలని గ్రామస్తులు పట్టుబట్టారు.అయితే, ఆ యువకుడు బ్యాగ్ తెరవడానికి నిరాకరించడంతో, అతన్ని ఉగ్రవాదిగా భావించి, భయంతో పోలీసులకు ఫోన్ చేశాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.

వైరల్‌గా మారిన వీడియోలో.గ్రామస్తులు, వ్లాగర్ వాగ్వాదం చేయడం చూడవచ్చు.బ్యాగ్‌ని విప్పి మీ అందరికీ చూపిస్తే.

వస్తువులన్నీ తిరిగి బ్యాగ్‌లో పెట్టేందుకు ఎక్కువ సమయం పడుతుందని.కావాలంటే మీరు పోలీసులకు ఫోన్ చేయవచ్చని ఆ యువకుడు వీడియోలో చెప్పాడు.

అలాగే యువకుడు తన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా చూపించాడు.ఇది నమ్మని గ్రామస్తులు పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.

దింతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube