పాకిస్థాన్ దేశం( Pakistan ) ఇటీవల తన సముద్రం దగ్గర చమురు, గ్యాస్ లాంటి ముఖ్యమైన వనరులు ఉన్నట్లు తెలుసుకుంది.ఈ గుడ్ న్యూస్ ను పాకిస్థాన్ దేశపు ఒక సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పారు.ఆయన “ఈ చమురు, గ్యాస్ రిజర్వ్‌ల( Oil Gas Reserves ) కారణంగా మా దేశం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది.” అని అన్నారు.ఈ వనరులతో పాకిస్థాన్ దేశం ఆ సముద్రాన్ని బాగా ఉపయోగించుకోగలరని ఆయన చెప్పారు.అంటే, సముద్రంలో చేపలు పట్టడం, ఓడరేవులు నిర్మించడం లాంటి పనులు బాగా చేసి, దేశాన్ని అభివృద్ధి చేయవచ్చు.
పాకిస్థాన్‌కు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పొచ్చు, కానీ ఇంకా కాస్త సమయం పడుతుంది.పాకిస్థాన్‌లో సముద్రం దగ్గర చమురు, గ్యాస్ బాగా దొరికింది అని చెప్పాం కదా.కానీ, ఇప్పుడే దాన్ని తీసి ఉపయోగించుకోలేరు.ఈ చమురు, గ్యాస్‌ను తీయాలంటే భూమిలో గొట్టాలు వేసి తీయాలి.
దీన్ని డ్రిల్లింగ్ వెల్స్( Drilling Wells ) అంటారు.అలా చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.
అంతేకాదు, దీనికి చాలా డబ్బు కూడా ఖర్చు అవుతుంది.
కానీ, ఈ చమురు, గ్యాస్ వల్ల పాకిస్థాన్‌కు చాలా లాభాలు ఉంటాయి.
దీని వల్ల పాకిస్తాన్ దేశం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది.ఇంకా, సముద్రం నుంచి కావలసిన ఇతర ఖనిజాలు కూడా దొరికే అవకాశం ఉంది.
మునుపు పాకిస్తాన్‌లో చమురు, గ్యాస్ సంస్థలో పనిచేసిన ఒకాయన మాట్లాడుతూ, “పాకిస్తాన్‌లో చమురు, గ్యాస్ రిజర్వులు కనిపించడం చాలా ఆనందంగా అనిపిస్తోంది.కానీ, అంత ఎక్కువ చమురు, గ్యాస్ ఉండకపోవచ్చు.అలాగే, దాన్ని తీయడం కూడా చాలా కష్టమే కావచ్చు” అని చెప్పారు.
ఆయన “దొరికింది గ్యాస్ అయితే, మనం ఇతర దేశాల నుంచి గ్యాస్ కొనవలసిన అవసరం ఉండదు.
అలాగే, దొరికింది చమురు అయితే, మనం ఇతర దేశాల నుంచి చమురు కొనవలసిన అవసరం తగ్గుతుంది” అని చెప్పారు.కానీ, దీని కోసం చాలా డబ్బు ఖర్చు అవుతుంది.
దాదాపు 5 బిలియన్ డాలర్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.