తెలుగు ప్రేక్షకులకు నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్( Renu Desai ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రేణు దేశాయ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు తన పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా( Social media ) వేదికగా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.
అలాగే సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ చేసేవారిపై తనదైన శైలిలో బుద్ధి చెబుతూ ఉంటుంది.అప్పుడప్పుడు సోషల్ మీడియాలో జరిగే పలు అంశాలపై కూడా తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ ఉంటుంది రేణు దేశాయ్.
తనపై ఎన్ని విమర్శలు వచ్చినా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటారు రేణూ దేశాయ్.ఇకపోతే ప్రస్తుతం ఏపీలో వరదల కారణంగా విజయవాడ ప్రాంతం మొత్తం నీట మునిగింది.ఈ క్రమంలో పెట్స్ కి ఎన్నో కష్టాలు వచ్చాయి.వరదల్లో ఎన్నో పెట్స్ కొట్టుకుపోయాయి.ఇంకెన్నో మృతి చెందాయి.వరదల్లో చిక్కుకున్న పెట్స్‌ని కాపాడేందుకు ఒక స్వచ్చంద సంస్థ తీవ్రంగా శ్రమిస్తోంది.
విజయవాడలో ఆ స్వచ్ఛంద సంస్థ పెట్స్‌ను కాపాడే ప్రయత్నం చేస్తుంది.ఈ క్రమంలో ఆ సంస్థకి విరాళం అందించాలని, సాయం చేయాలని, మన వంతుగా అండగా నిలబడాలని రేణూ దేశాయ్ కోరింది.
తన వంతుగా 20 వేల ఆర్థిక సాయం రేణూ దేశాయ్ ప్రకటించింది.
ఆ సంస్థకి 20,000 ఫోన్ పే లో పంపించానని చూపిస్తూ అందరూ చేతనైన సాయం అందించమని కోరింది.ఎవరికి వీలైన అంతగా అంటే 100, 500 ఇలా ఎంతైనా సరే సాయం చేయండని ఆమె కోరింది.స్వయంగా విజయవాడకి వెళ్లి వా( Vijayawada )రు చేస్తున్న ఈ స్వచ్చంద సేవ కార్యక్రమాల్లో పాల్గొని పెట్స్‌ని కాపాడాలని అనుకుందంట.
కానీ తన ఆరోగ్యం సహకరించకపోవడం, ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇలా కేవలం ఆర్థిక సాయం మాత్రమే ప్రకటించమని చెప్పుకొచ్చింది.