ప్రస్తుత రోజుల్లో పలుచటి జుట్టుతో సతమతం అయ్యే వారి సంఖ్య భారీగా ఉంది.స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు.
ఇలాంటివారు జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.తోచిన చిట్కాలు పాటిస్తుంటారు.
ఖరీదైన షాంపూ వాడుతుంటారు.అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే తెగ హైరానా పడుతుంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే నెల రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా మారడం ప్రారంభమవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే నాలుగు టేబుల్ స్పూన్లు బియ్యాన్ని ( rice )వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించిన రైస్ ను వాటర్ తో సహా మిక్సీ జార్ లో వేసుకోవాలి.అలాగే ఒక ఫుల్ ఎగ్( Egg ), అరకప్పు కొబ్బరి పాలు( Coconut milk ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ఉపయోగించే శుభ్రంగా తలస్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో జుట్టు ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది.కాబట్టి పలుచటి జుట్టు తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.పైగా ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు స్మూత్ అండ్ సిల్కీ గా సైతం మారుతుంది.







