ముఖ్యంగా చెప్పాలంటే మారుతున్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఎసిడిటీ( Acidity )తో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది.మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడంలో శరీరంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే మోతాదుకు మించి యాసిడ్ ఉత్పత్తి అయితే సమస్య ఇంకా పెరుగుతుంది.దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడంతో పాటు కడుపులో మంట,( Stomachache ) నొప్పి, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఇలాంటి వారిలో క్రమం తప్పకుండా పుల్లటి తేన్పులతో పాటు కడుపులో మంట కూడా ఉంటుంది.దీంతో వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.

అయితే ఆ అసిడిటీని కొన్ని న్యాచురల్ పద్ధతులలో కూడా తగ్గించుకోవచ్చు.ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఎలాంటి విధానాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే కడుపులో మంటగా ఉంటే పాల( Milk )ను తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది.అయితే పాలను ఫ్రిజ్ లో పెట్టుకుని చల్లటి పాలను తాగితే మరింత మెరుగైన ప్రయోజనాన్ని పొందవచ్చు.
దీంతో అసిడిటీ నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.పాలలోని క్యాల్షియం పొట్టలోని ఆమ్లం ఉత్పత్తిని నిరోధిస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) లో ఉండే యాసిడ్ అసిడిటీని నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

ఇది కడుపులో యాసిడ్ స్రావాన్ని తగ్గిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ( Apple Cider Vinegar )ను నీటిలో కలిపి తాగడం వల్ల ఎసిడిటీ వల్ల కలిగే మంట, నొప్పి తగ్గుతాయి.అలాగే జీర్ణ క్రియాను మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ కూడా ఇందులో ఉంటాయి.
దీన్ని రోజు తాగితే అసిడిటీ నియంత్రణలో ఉంటుంది.అంతేకాకుండా తులసి ఆకులు( Basil leaves ) కూడా అసిడిటీకి దివ్య ఔషధంగా పని చేస్తాయి.
అలాగే తులసిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఈ సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.ఇది కడుపులో యాసిడ్ ప్రభావాన్ని తగ్గించి కడుపుని ప్రశాంతంగా ఉంచుతుంది.
కొన్ని తులసి ఆకులను గ్రైండ్ చేసి నీటిలో కలుపుకొని తాగడం వల్ల ఎసిడిటీ సమస్య ( Acidity problem )త్వరగా దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు.