తెలంగాణలో కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్రకు షెడ్యూల్ ఖరారు అయింది.ఈ మేరకు ఈనెల 26, 27 వ తేదీల్లో రెండో విడత బస్సు యాత్రను నాయకులు చేపట్టనున్నారు.
ఈ బస్సు యాత్రలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొననున్నారు.అదేవిధంగా రెండో విడత యాత్రలో భాగంగానే బీసీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా ఇటీవల విజయభేరీ బస్సు యాత్రను పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ యాత్ర రామప్ప దేవాలయం నుంచి ప్రారంభమై మూడు రోజుల పాటు కొనసాగింది.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది.







