ఇటీవల కాలంలో అత్యధికంగా కురుస్తున్న వర్షాలు కారణంగా దేశవ్యాప్తంగా జన జీవనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ తెలంగాణలో ఈ వర్షపాతానికి అతలాకుతలం అవుతోంది.
వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ , భారీగా ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి.తాజాగా మరోసారి భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది .మహారాష్ట్ర, తెలంగాణ, ఒరిస్సా తో పాటు , ఏపీలోను భారీగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది.
ఏపీలో సెప్టెంబర్ 8న రెడ్ అలర్ట్ జారీ చేసింది .ఐఎండి తన తాజా ప్రకటనలో సెప్టెంబర్ 8న కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానంలో అతి భారీ వర్షాలు ( Heavy rains )కురిసే అవకాశం ఉందని తెలిపింది .
సెప్టెంబర్ 8 , 9 తేదీల్లో కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానం , తెలంగాణలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది.తెలంగాణలోని కొమరం భీమ్ అసిఫాబాద్ , మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు , భద్రాద్రి కొత్తగూడెం లలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ , కరీంనగర్, పెద్దపల్లి , ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. హైదరాబా( Hyderabad )ద్ పరిసరాల్లో ఆకాశం మేఘవృతమై ఉంటుందని , నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఇప్పటికే అకస్మాత్తుగా వచ్చిపడిన వానలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తేలడంతో, ముంపు ప్రాంత ప్రజల్లో మరింత భయాందోళనలు నెలకొన్నాయి.ఏపీలోని విజయవాడ తో పాటు , తెలంగాణలోని ఖమ్మం జిల్లా వరద ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. మరోసారి భారీగా కురుస్తున్న వర్షాలతో వరద ముప్పు మరింత పెరుగుతుందనే ఆందోళన ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో నెలకొంది.