ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా విజయవాడ( Vijayawada ) గురించి మాట్లాడుకుంటున్నారు.అకాల వర్షాల కారణంగా విజయవాడ మొత్తం నీట మునిగిన విషయం తెలిసిందే.
ఇప్పుడిప్పుడే నెమ్మదిగా విజయవాడలోని కొన్ని వరద ప్రభావిత ప్రాంతాలలో వరద నీరు తగ్గుతున్నాయి.ఏవి ప్రభుత్వం ఇప్పటికే విజయవాడ ప్రజలను ఆదుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ తెలిసిందే.
వరదలతో అతలాకుతలమైన విజయవాడకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ తమకు చేతనైన స్థాయిలో విరాళాలు అందిస్తున్నారు.
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు.
ఇక విరాళాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది.విరాళాలు( Donations ) అందించేందుకు బ్యాంకు అకౌంట్ వివరాలను సైతం పౌరులతో పంచుకుంది.ఈ క్రమంలోనే వరద బాధితులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP Deputy CM Pawan Kalyan ) అభిమాని ఒకరు రూ.600 వరద సాయం అందించారు.ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించగా.
ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.ఇక ఈ ట్వీట్‌కు డిప్యూటీ సీఎంవో కార్యాలయం సైతం స్పందించడం విశేషం.
అయితే పనిచేస్తే కానీ పూట గడవని స్థితిలో.వరద బాధితులకు సాయంగా నిలవాలనే తపనతో ఆయన చేసిన సాయంపై నెటిజనం ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈరోజు నేను పనికి వెళ్లి సంపాదించిన ఈ 600 రూపాయలను విజయవాడ వరద బాధితులకు కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపిస్తున్నాను.
ఆదివారం పని ఉంది.ఆ డబ్బులు కూడా పంపిస్తాను.పవన్ కళ్యాణ్ గారు నాకు స్ఫూర్తి.
కష్టాలన్నవి అందరికీ వస్తూ ఉంటాయి.ఆ కష్టం ఏంటన్నది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుంది.
అంటూ గుడవర్తి సుబ్రమణ్యం ( Gudavarthy Subramaniam )అనే వ్యక్తి ట్వీట్ చేశాడు.ఇక ఈ ట్వీట్‌కు డిప్యూటీ సీఎంవో కార్యాలయం సైతం స్పందించింది.
ఈ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది.రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుంచి వరద బాధితులకు సహాయం అందించాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం.
ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతీ రూపాయి విలువైనది, అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ.నిస్వార్ధంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి సహాయనిధికి అందించిన 600 రూపాయలు చాలా విలువైనవి.
మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ తరుఫున డిప్యూటీ సీఎంవో ట్వీట్ చేసింది.