ఎప్పటిలాగే ఈసారి కూడా దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.కేవలం కొన్ని ప్రదేశాలలో మాత్రమే వర్షాల కారణంగా వినాయక చవితి వేడుకలు జరగడం లేదు.
ఇకపోతే ఈసారి కూడా కొన్ని కొన్ని ప్రదేశాలలో వినాయకుడు రకరకాల రూపాల్లో దర్శనమిస్తున్నారు.ఎప్పటికప్పుడు క్రియేటివ్ గా ఆలోచిస్తూ కొత్త కొత్తగా తయారు చేస్తూ మండపాల్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా సినిమా తీములకు సంబంధించి పుష్ప, వినాయకుడు, బాహుబలి వినాయకుడు, ఆర్ఆర్ఆర్ వినాయకుడు అంటూ గతంలో చాలా రకాల వినాయకులను తయారు చేసిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఈసారి చాలావరకు చాలా ప్రదేశాలలో కల్కి( Kalki ) తీమ్ తో చాలా వినాయకులను తయారు చేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ప్రభాస్( Prabhas ) హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ( Kalki 2898AD ) సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇందులో అశ్వత్థామగా( Ashwatthama ) అమితాబ్ బచ్చన్, యాస్కిన్ గా కమల్ హాసన్, భైరవ పాత్రలో ప్రభాస్ కనిపించి మెప్పించారు.అన్నిటికంటే ముఖ్యంగా కల్కి వెహికల్ బుజ్జి ఆకట్టుకుంది.
ఇప్పుడు ఇదే సినిమాను పోలిన ఒక వినాయక మందిరం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడులోని( Tamil Nadu ) కృష్ణగిరి జిల్లాలో కల్కి సెట్లా మందిరం వేశారు.కాంప్లెక్స్ లో నుంచి లోపలికి వెళ్లేలా డిజైన్ చేశారు.లోపల కమల్ హాసన్ పాత్ర బొమ్మ పెట్టి శివుడి విగ్రహం, అశ్వత్థామగా వినాయకుడిని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.ఇటీవల పుష్ప2 లోని సూసేకి పాట స్టిల్ లో వినాయకుడు కూడా సందడి చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఒక్కొక్కరు ఒకొక్క విధంగా స్పందిస్తున్నారు.