మెగాస్టార్ చిరు( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఎప్పటికప్పుడు తన అభిమానుల కోసం తనలోని ఉన్న టాలెంట్ ను బయట ప్రపంచానికే తెలిసేలాగా చిరు ఉంటారన్న విషయం అందరికి తెలిసిన విషయమే.
అంతేకాకుండా.వరుస సినిమాలతో యంగ్ హీరోలకు గట్టి పోటీ కూడా ఇస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
ప్రస్తుతం చిరంజీవి యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో “విశ్వంభర” సినిమా( Vishwambhara )లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.అయితే చిరంజీవి తాజాగా ఒక ప్రముఖ యాడ్ లో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
ఆ ప్రముఖ యాడ్ విషయానికి వస్తే.కంట్రీ డిలైట్ అనే మిల్క్ బ్రాండ్ ప్రమోషన్ చేశారు.
ఈ యాడ్ ను కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ చేసినట్లు సమాచారం.
ఇక ఈ యాడ్లో చిరు పర్ఫామెన్స్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.ఇక ఈ యాడ్ కు హైలెట్ ఏమిటి అంటే.ఊరికనే మెగాస్టార్ అయిపోరు అంటూ చివర్లో వచ్చే డైలాగ్.ఈ మిల్క్ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ మాత్రం చాలా వెరైటీగా ప్లాన్ చేశారు దర్శకుడు.యాడ్ మేకింగ్ నే ఫైనల్ యాడ్ గా సెట్ చేశారు.ఇందులో తన డైలాగు వెర్షన్ ప్రిపేర్ అవుతున్నట్లు చిరంజీవి కనిపించగా ఒరిజినల్ యాడ్ తీసింది హరి శంకర్ అయితే ఈ యాడ్ లో కనిపించేది మాత్రం యాడ్ ఫిలిం మేకర్ గా కమెడియన్ సత్య.
ఈ క్రమంలో షార్ట్ రెడీ అని అనగానే.చిరంజీవిలోనుంచి ఆత్మారావు బయటకు వస్తాడు.ఈ ఆత్మ రావ్ మనకు అన్నయ్య సినిమా( Annayya )లో కనపడతాడు.ఆ సినిమాలో చిరు కామెడీ ఒక రేంజ్ లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అచ్చం ఆ క్యారెక్టర్ ఇక్కడ యద లోకి తీసుకొని వచ్చారు.ఇక ఈ యాడ్ లో చిరంజీవి క్లాస్ గా కనపడితే ఆత్మ రావ్ మాత్రం మాస్ క్యారెక్టర్.
వీరిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్ మొత్తం కూడా పాల బ్రాండ్, దాని గొప్పదనం, పాలను ఎలా బుక్ చేసుకోవాలి అన్న వివరాలను తెలియజేశారు.ఇప్పటివరకు మనం అనేక కమర్షియల్ యాడ్స్ ను చూసి ఉంటాం.
కానీ., ఈ చిరు యాడ్ మాత్రం చాలా డిఫరెంట్గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇంకా ఈ యాడ్ ను చూసిన చిరంజీవి ఫ్రాన్స్ చిరు పర్ఫామెన్స్ గురించి అనేక రకాలుగా కామెంట్ చేస్తున్నారు.