మొటిమ‌లు ఎంత‌కూ త‌గ్గ‌ట్లేదా? అయితే 2 రోజుల్లో త‌రిమికొట్టండిలా!

టీనేజ్ ప్రారంభం అయ్యిందంటే చాలు మొటిమలు విపరీతంగా వేధిస్తూ ఉంటాయి.హార్మోన్ చేంజెస్, ఆహారపు అలవాట్లు, గంటల తరబడి ఫోన్ మాట్లాడడం, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం, చర్మంపై ఆయిల్ ఉత్పత్తి అధికంగా ఉండడం, కాలుష్యం తదితర కారణాల వల్ల మొటిమ‌లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

 Effective Home Remedy To Get Rid Of Pimples Quickly! Home Remedy, Pimples, Skin-TeluguStop.com

అయితే కొందరికి చాలా త్వరగా మొటిమ‌లు తగ్గిపోతాయి.కొందరిలో మాత్రం మొటిమలు వ‌చ్చాయంటే అంత త్వరగా తగ్గవు.

పైగా తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి.దాంతో వాటిని వదిలించుకోవడం కోసం రకరకాల క్రీములు వాడుతుంటారు.

మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా? అయితే ఇకపై నో టెన్షన్.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని కనుక ట్రై చేస్తే కేవలం రెండు రోజుల్లోనే మొటిమలను తరిమికొట్టొచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక అలోవెరా ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్‌ను సపరేట్ చేయాలి.

అలాగే ఒక మీడియం సైజు కీరదోసకాయను తీసుకుని వాటర్ తో వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.వీటితో పాటు గుప్పెడు వేపాకుల‌ను కూడా తీసుకుని నీటిలో కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర ముక్కలు, వేపాకులు మరియు అలోవెరా జెల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Acne, Tips, Remedy, Latest, Pimples, Skin Care, Skin Care Tips-Telugu Hea

ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం నుంచి జ్యూస్‌ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్ల చందనం పొడి కలిపి మొటిమలు ఉన్న చోటే కాకుండా ముఖం మొత్తానికి అప్లై చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వరుసగా రెండు, మూడు రోజులు చేశారంటే మొటిమలు క్రమంగా మాయం అవుతాయి.

వాటి తాలూకు మచ్చలు సైతం దూరం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube