యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
అందులో భాగంగానే ఇటీవలె దేవర సినిమాను పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.అలాగే వార్ 2 తో పాటు ప్రశాంత్ నీల్( Prashanth Neil ) దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కూడా నటిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్.
ఇకపోతే ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమా ఈనెల 27వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.
దానితో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు ఎన్టీఆర్.అయితే గతంలో ఎన్టీఆర్ చాలా ఫ్లాప్ చిత్రాలు చూశారు.సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లో చాలా డౌన్ ఫాల్ చూశారు.
మళ్ళీ యమదొంగ తో పుంజుకున్నారు.యమదొంగ తర్వాత కూడా కొన్ని ఫ్లాపులు పడ్డాయి కానీ ఎన్టీఆర్ కెరీర్ కి అంత ఇబ్బంది కాలేదు.
అయితే ఎన్టీఆర్ కెరీర్ లో రిస్క్ చేసి నటించిన మూవీని ప్రేక్షకులు భావిస్తారు.ఎందుకంటే ఈ చిత్రంలో తారక్ పాత్ర నెగిటివ్ టచ్ తో ఉంటుంది.
ఈ చిత్రానికి కథ అందించిన వక్కంతం వంశి( Vakkantam Vamsi ) కూడా ఇదే విషయాన్ని తెలిపారు.టెంపర్ విషయంలో వక్కంతం వంశీ స్వయంగా ఎన్టీఆర్ నే ప్రశ్నించారు.
బాద్షా తర్వాత ఎన్టీఆర్ కి రామయ్య వస్తావయ్యా, రభస రూపంలో రెండు డిజాస్టర్లు గురయ్యాయి.ఆ టైంలో ఎంచుకున్న కథ టెంపర్.తేడా కొడితే హ్యాట్రిక్ ఫ్లాపులు పడతాయి.రిస్క్ అనిపించలేదా అని వక్కంతం వంశీ అడిగారు.దీనికి ఎన్టీఆర్ ఎమోషనల్ గా సమాధానం ఇచ్చాడు.ఈ కథ విన్నప్పుడు నాకు గ్రే షేడ్, పాజిటివ్ షేడ్ కనిపించలేదు.
ఒక మనిషి ప్రయాణం మాత్రమే కనిపించింది.మంచి వాడు చెడ్డవాడిగా మారితే చెడ్డవాడిగానే చనిపోతాడు.
చెడ్డవాడు మంచి వాడిగా మారితే దేవుడిగా మిగిలిపోతాడు అనేది ఈ చిత్రం కథాంశం.నేను నమ్మేది కూడా అదే అని ఎన్టీఆర్ అన్నారు.
నేను చనిపోతే నా ఫ్యామిలీ కాకుండా బయట వాళ్ళు కూడా ఎంతోకొంత మంది బాధపడాలి.ఒక మనిషిగా నేను సాధించుకోగలిగేది అదే అని ఎన్టీఆర్ తెలిపారు.
నేను నమ్మే సిద్ధాంతంతానికి దగ్గరగా ఉండే చిత్రం టెంపర్( Temper ) అని ఎన్టీఆర్ తెలిపారు.