బిగ్‌బాస్ 8వ సీజన్‌లో( Bigg Boss ) కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన వారిలో విష్ణుప్రియ ఒకరు.ఈ ముద్దుగుమ్మ తన ఆటతో చాలా బాగా ఆకట్టుకుంటుందని ప్రేక్షకులు సంబరపడ్డారు.
కానీ ఆమె మాత్రం హౌస్‌లో చాలా పెంట చేస్తోంది.తనేం మాట్లాడుతుందో తనకే తెలియనట్టుంది.
ఏ సందర్భాల్లో ఏ పదాలు ఉపయోగించాలో కూడా ఆమెకు తెలియడం లేదు.ఫస్ట్ ఎపిసోడ్స్‌లో మాస్కులినిటీ, ఫెమినిటీ పదాల్ని మగ, ఆడ తేడా లేకుండా ఆమె వాడేసింది.
సాఫ్ట్, టఫ్ క్యారెక్టర్స్ ను డిస్క్రైబ్ చేయడంలో ఆమె అలా మాట్లాడి ఉండొచ్చని, అలా మాట్లాడడంలో తప్పులేదు అని చాలామంది విష్ణుప్రియ( Vishnu Priya ) వెనకేసుకొచ్చారు.అయితే రీసెంట్‌గా ఆమె “పుణ్యస్త్రీ” పదాన్ని వాడేసింది.
మంచి క్యారెక్టర్ ఉన్న మహిళలను పుణ్యస్త్రీలు అంటారు అని ఆమె చెప్పింది.కానీ ఆ పదానికి అర్థం అది కాదు.
పుణ్యస్త్రీ అంటే సుమంగళి, సౌభాగ్యవతి, భర్త కలిగిన మహిళ, ముత్తయిదువ.ఇన్ని అర్ధాలు ఉన్నా అవన్నీ ఒకటే.సింపుల్ గా చెప్పాలంటే పుణ్యస్త్రీ అంటే హస్బెండ్ ఉన్న ఒక మహిళ అని అర్థం.విష్ణుప్రియ ఈ పదాన్ని తప్పుగా వాడింది.
నిజానికి ఆమె చేత బిగ్ బాస్ టీమే ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడమని, ఆడమని చెప్పినట్లుంది.
విష్ణుప్రియ రీసెంట్ ఎపిసోడ్‌లో సోనియా( Sonia ) దగ్గరకు వెళ్లి… “ఫస్ట్ నీకూ, నిఖిల్‌కూ అసలు పడలేదు.కానీ సడన్‌గా ఏంటి మీమధ్య ఇంత మంచి ఫ్రెండ్‌షిప్ కుదిరింది?” అని ప్రశ్నించింది.ఇలా అడగడంలో పెద్దగా తప్పులేదు కానీ ఆమె అడిగిన తీరే చాలామందికి నచ్చలేదు.
మీ మధ్య ఏదో అఫైర్ మొదలైంది అన్నట్లుగా ఆమె తెలుగు పదాల ఉచ్ఛరణ ఉంది.అందుకే విష్ణుప్రియ ఆ ప్రశ్న వేయగానే చాలా అసౌకర్యంగా ఫీల్ అయింది సోనియా.
ఇలాంటి క్వశ్చన్లు మళ్లీ వేయకూడదని తెలిపింది.దాంతో విష్ణుప్రియ “నేను మంచి అర్థంలోనే అడిగాను” అంటూ పదేపదే సోనియాని విసిగించింది.
అదే క్రమంలో పుణ్యస్త్రీ అంటే మంచి క్యారెక్టర్ ఉన్న మహిళ అంటూ రచ్చ లేపింది.
విష్ణుప్రియ ధోరణి భరించలేక సోనియా బోరున ఏడ్చేసింది.అయినా సరే విష్ణుప్రియ ఆమెను వదల్లేదు.ఒక కంటెస్టెంట్ ఫీలింగ్స్ తాను హార్ట్ చేసానని ఆమె ఏమాత్రం రియలైజ్ కాకుండా ఏవేవో మాటలు అనేసింది.
హుందాతనం, తెలివి ఏమాత్రం ప్రదర్శించని విష్ణుప్రియ హౌస్ లో ఇంకెంత పెంట చేస్తుందేమో అని చాలామంది భయపడిపోతున్నారు.నాగార్జున ఆమెను సున్నితంగా మందలించి వదిలేశారు.బిగ్ బాస్ కి ఇలాంటి పెంట పంచాయతీలే కావాలి.అందుకే ఏమీ అనకుండా ఉంటున్నట్లు ఉన్నారు.
ఇకపోతే ఈ వారం బేబక్క హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వచ్చని వార్తలు వస్తున్నాయి.