వేరే ఇండస్ట్రీల సినిమాలతో హిట్స్ సాధించిన టాలీవుడ్ హీరోలు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వేరే భాషల హిట్ సినిమాలను రీమేక్ చేయడం కొత్తేం కాదు.అయితే కొన్నిటిని చూస్తే అవి ఒరిజినల్ తెలుగు సినిమాలు అనిపిస్తుంది.

 Tollywood Remakes From Other Industriesn , Tollywood Remakes, Rakshasudu, Gaddal-TeluguStop.com

ఎందుకంటే అందులో హీరోలు అంత బాగా నటిస్తారు.డైరెక్టర్లు కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సినిమా తీస్తారు.అలాంటి కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం.

• రాక్షసుడు

రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రాక్షసుడు( Rakshasudu ) (2019) సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే.ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన నేర్పించారు.ఈ మూవీ తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది.అందరి నుంచి దీనికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.అయితే ఇది 2018 తమిళ చిత్రం రాత్ససన్‌కి అఫీషియల్ రీమేక్.

• గద్దల కొండ గణేష్

( Gaddalakonda Ganesh )

హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ గద్దలకొండ గణేష్ (2019) బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ 2014 తమిళ చిత్రం “జిగర్తాండ”కి అధికారిక రీమేక్.నిజానికి ఈ తమిళ మూవీ కూడా సౌత్ కొరియా చిత్రం “ఎ డర్టీ కార్నివాల్ (2006)” నుంచి ప్రేరణ పొందింది.మన తెలుగు చిత్రంలో వరుణ్ తేజ్, అధర్వ, పూజా హెగ్డే, మిర్నాళిని రవి నటించి మెప్పించారు.

Telugu Guard, Drushyam, Gabbar Singh, Gopala Gopala, Rakshasudu, Tollywood-Movie

• గబ్బర్ సింగ్

( Gabbar Singh )

హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన యాక్షన్ ఫిల్మ్ గబ్బర్ సింగ్ (2012) 104 కోట్లు కలెక్ట్ చేసి ఆ సమయానికి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో తెలుగు సినిమా అయింది.ఇందులో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కెమిస్ట్రీ బాగా కుదిరింది.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం నెక్స్ట్ లవర్ అని చెప్పుకోవచ్చు.అయితే ఇది ఒరిజినల్ తెలుగు మూవీ ఏం కాదు.ఇది హిందీ హిట్ మూవీ దబాంగ్ (2010)కి రీమేక్.అయితే ఇందులో హరీష్ శంకర్ స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్‌లలో కొన్ని పెద్ద మార్పులు ఉన్నాయి.

• దృశ్యం, దృశ్యం 2

( Drushyam , Drushyam 2 )

దృశ్యం 2014లో విడుదలైన తెలుగు చిత్రం, ఇది 2013లో విడుదలైన మలయాళ చిత్రం “దృశ్యం” రీమేక్.మలయాళ సినిమాను జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేశాడు.

తెలుగు దృశ్యం మూవీని మాత్రం శ్రీప్రియ డైరెక్ట్ చేసింది.ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో వెంకటేష్ (ఒరిజినల్‌లో మోహన్‌లాల్ చేసిన పాత్ర), మీనా (ఒరిజినల్ సినిమాలోనూ ఆమె నటించింది.

), నదియా (ఒరిజినల్‌లో ఆశా శరత్) కీరోల్స్ ప్లే చేశారు.త్రిష టు సినిమా కూడా దీనికి మలయాళం లో వచ్చిన దృశ్యం 2కు రీమేక్.

తెలుగులో వెంకటేష్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

Telugu Guard, Drushyam, Gabbar Singh, Gopala Gopala, Rakshasudu, Tollywood-Movie

• గోపాల గోపాల

( Gopala gopala )

కిషోర్ కుమార్ పార్ధసాని డైరెక్ట్ చేసిన గోపాల గోపాల (2015) సినిమాలో వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రియా శరణ్, మిథున్ చక్రవర్తి నటించగా, ఆశిష్ విద్యార్థి, పోసాని కృష్ణ మురళి సహాయక పాత్రలు పోషించారు.ఇది 2012 హిందీ ఫిల్మ్ OMG – ఓ మై గాడ్‌కి రీమేక్.

Telugu Guard, Drushyam, Gabbar Singh, Gopala Gopala, Rakshasudu, Tollywood-Movie

• బాడీ గార్డ్‌

( Body guard )

వెంకటేష్ హీరోగా వచ్చిన తెలుగు మూవీ బాడీగార్డ్ హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన బాడీ గార్డ్ కి రీమేక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube