రామ్ చరణ్ ( Ram Charan )హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా( Game Changer ) మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను రీసెంట్ గా ‘వినాయక చవితి’ సందర్భంగా రిలీజ్ చేశారు.
అయితే సినిమా పోస్టర్లను రెడీ చేస్తున్నారు.తప్ప సినిమా నుంచి టీజర్ ని గాని, ట్రైలర్ గానీ రిలీజ్ చేయడం లేదు.
అలాగే సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దాని మీద కూడా సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు సైతం ప్రాజెక్ట్ లా మీద ప్రాజెక్ట్ లు టేక్ ఆఫ్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
కానీ ఈ ప్రాజెక్టు మాత్రం ఎప్పుడు థియేటర్లలోకి వస్తుంది అనే దాని మీద సరైన క్లారిటీ మాత్ర ఇవ్వలేకపొతున్నాడు…ఇక దానికి కారణం శంకర్ ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా మళ్లీ రీ చెక్ చేసుకుంటూ వస్తున్నట్లుగా తెలుస్తుంది.

భారతీయుడు 2( Bharateeyudu 2 ) సినిమాతో ఫ్లాప్ ని మూట గట్టుకున్న శంకర్ ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలననే ఒక దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానుల ఓపిక నశించిపోతుందనే చెప్పాలి.
ఇక ఇప్పటికే స్టార్ హీరోలందరూ వాళ్ళ సినిమాల రిలీజ్ డేట్ ఇస్తు సినిమాలను రిలీజ్ కి సిద్ధం చేస్తున్న నేపథ్యంలో దాదాపు మూడు సంవత్సరాల నుంచి శంకర్ ఈ సినిమాని చెక్కుతూనే ఉన్నాడు.