వచ్చేవారం సింగపూర్( Singapore ) రానున్న పోప్ ఫ్రాన్సిస్( Pope Francis ) కోసం భారతీయ సంతతికి చెందిన కార్పెంటర్ చేతితో తయారుచేసిన కుర్చీలను ఉపయోగించనున్నారు.44 ఏళ్ల గోవిందరాజ్ ముత్తయ్య( Govindharaj Muthiah ) ఈ కుర్చీలను తయారుచేశారు.2019 నుంచి నేటి వరకు పూర్తి సమయం ఈ పనికే ఆయన అంకితమయ్యారని ఛానెల్ న్యూస్ ఆసియా నివేదించింది.జులై చివరిలో సింగపూర్‌లోని రోమన్ క్యాథలిక్ ఆర్చ్‌డియోసెస్ నుంచి తనకు కాల్ వచ్చినట్లు ముత్తయ్య తెలిపారు.
మీ వద్ద కొలతలు ఉంటే కుర్చీలు తయారు చేసిపెడతానని తాను వారితో అన్నట్లు ఆయన వెల్లడించారు.సాధారణంగా తాను కస్టమర్‌లకు ఒకటే చెబుతానని , మీకు కావాల్సింది నాకు గీసి చూపించగలిగితే కావాల్సింది చేసిస్తానని పేర్కొన్నారు.
పోప్ ఫ్రాన్సిస్ తన 12 రోజుల ఆసియా పసిఫిక్ పర్యటనలో ఇండోనేషియా, పపువా న్యూగినియా, తైమూర్ లెస్టే , సింగపూర్‌లను సందర్శించనున్నారు.సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు సింగపూర్‌లో ఫ్రాన్సిస్ ఉంటారు.2013లో ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్ చర్చిలకు అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటికన్ సిటీ( Vatican City ) వదిలి ఈ స్థాయిలో సుదీర్ఘ పర్యటన చేయడం ఆయన ఇదే తొలిసారి.
సింగపూర్ పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం,( President Tharman Shanmugaratnam ) ప్రధాని లారెన్స్ వాంగ్‌లను కలవనున్నారు.అలాగే నేషనల్ స్టేడియంలో సామూహిక సభకు అధ్యక్షత వహించనున్నారు.క్యాథలిక్ జూనియర్ కాలేజీలో యువతతో ముచ్చటించనున్నారు.
మతాంతర సంభాషణల సమయంలో ముత్తయ్య తయారుచేసిన కుర్చీలను ఉపయోగించనున్నారు.హిందూ మతాన్ని అవలంభిస్తున్న ముత్తయ్య దీనికి కావాల్సిన కలప కోసం దేవాలయాలు, మసీదులను కూడా సంప్రదించారు.
18వ శతాబ్ధానికి చెందిన ఫర్నీచర్ మోడల్ నుంచి స్పూర్తి తీసుకుని పోప్ ఫ్రాన్సిస్ కోసం కుర్చీలను తయారుచేసినట్లు తెలిపారు.కుర్చీ హెడ్‌బోర్డ్ పాత నోవెనా చర్చి ముఖభాగం ఆధారంగా తయారు చేసినట్లుగా ముత్తయ్య వెల్లడించారు.
దీనినే చర్చ్ ఆఫ్ సెయింట్ ఆల్ఫోన్సస్‌గానూ వ్యవహరిస్తారు.తనకు పోప్‌ను కలిసే అవకాశం వస్తే .ఈ కుర్చీ మైక్రో డిజైన్‌ను ఆయనకు అందిస్తానని ముత్తయ్య చెబుతున్నారు.