వీడియో: ఆటో కింద పడిన తల్లి.. సింగిల్ హ్యాండ్‌తో పైకి లేపిన కూతురు..

ఈ రోజుల్లో భారతీయ రోడ్లపై సేఫ్టీ లేకుండా పోయింది.ప్రతి ఒక్కరూ చాలా స్పీడ్‌తో వాహనాలు నడుపుతున్నారు.

 Viral Video Brave Schoolgirl In Mangaluru Turns Auto To Save Mother Details, Man-TeluguStop.com

దీనివల్ల రోడ్డు క్రాస్ చేయడం కూడా అసాధ్యంగా మారింది.కొంతమంది వాహనాలు వస్తున్నా చేసేదేమీ లేక అలాగే దాటేస్తున్నారు.

ఆ సమయంలో కూడా కొందరు బ్రేకులు వేయడం లేదు.ఇటీవల ఆటో డ్రైవర్( Auto Driver ) చాలా ఫాస్ట్ గా వెళుతూ రోడ్డు క్రాస్ చేస్తున్న ఒక మహిళను బలంగా ఢీకొట్టాడు.

మంగళూరులోని( Mangaluru ) కిన్నీగోళి రామనగర్‌లో ఈ భయంకరమైన సంఘటన జరిగింది.అయితే ఆ మహిళ కూతురు వెంటనే రెస్క్యూ చేయడానికి వచ్చింది.

ఆమె తన తల్లిని ఆటో ప్రమాదం నుంచి తన తెలివితేటలు, ధైర్యంతో కాపాడింది.

ఈ సంఘటన చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఆ వీడియో ప్రకారం ఒక ఆటో రిక్షా( Auto Rickshaw ) చాలా వేగంగా వెళుతూ రోడ్డు దాటే మహిళను ఢీకొట్టింది.ఈ ఘటనలో ఆ ఆటో పల్టీ కొట్టి ఆ మహిళపై పడింది.

అదృష్టవశాత్తూ, ఆ మహిళ కూతురు అక్కడే ఉన్న ట్యూషన్ సెంటర్ నుంచి వెంటనే అక్కడికి చేరుకుంది.

చాలా ధైర్యంగా, ఆ చిన్న అమ్మాయి పల్టీ కొట్టిన ఆటోను ఎత్తి తన తల్లిని కాపాడింది.అంతా కలిసి ఆ చిన్న అమ్మాయి ధైర్యం శక్తిని చూసి ఆశ్చర్యపోయారు.ఈ సంఘటన అంతా ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.అమ్మాయి ధైర్యానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు

ఆ ప్రమాదంలో గాయపడిన మహిళ పేరు చేతన.ఆమెకు 35 ఏళ్లు.ఈ ప్రమాదంలో ఆ తల్లికి చాలా గాయాలు అయ్యాయి.

కాబట్టి ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.ఆ ఆటో డ్రైవర్, ఆ ఆటోలో ప్రయాణించే వాళ్లకు కూడా గాయాలు అయ్యాయి.

ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు ఈ సీసీ కెమెరా వీడియోను చూస్తున్నారు.

ఆ అమ్మాయి చేసిన ధైర్యం చాలా మందిని ఆకట్టుకుంది.

చాలా మంది ఆమె చూపించిన ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.ఎంత పెద్ద సాహసం చేసిన ఈ చిన్నారికి ఏదైనా అవార్డు ఇచ్చి సత్కరించాలని మరికొంతమంది కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube