తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి( S V Krishna Reddy )…ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించాయ.నిజానికి చిన్న హీరోలతో సినిమాలను చేసి భారీ సక్సెస్ లను అందుకున్న దర్శకులలో ఈయన మొదటి స్థానంలో ఉంటాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి.ముఖ్యంగా ఈయన జగపతిబాబు, శ్రీకాంత్( Jagapathi Babu, Srikanth ) లతో చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా చిన్న హీరోలతో పెద్ద సక్సెస్ లను సాధిస్తాడు అనే ఒక ట్రాక్ రికార్డును కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమం లోనే స్టార్ హీరోలు అయిన బాలకృష్ణ నాగార్జున తో కూడా ఈయన సినిమాలు చేసిన విషయం మనకు తెలిసిందే… ముఖ్యంగా బాలకృష్ణతో ‘టాప్ హీరో’ అనే సినిమా చేశాడు.అలాగే నాగార్జునతో ‘వజ్రం ‘ అనే సినిమా( Vajram ) చేశాడు.ఈ రెండు సినిమాలు ఆశించిన మేరకు విజయాన్నైతే సాధించలేదు.ఇక మొత్తానికైతే ఆయన సాధించిన విజయాలు మరే దర్శకుడు సాధించలేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేసిన సినిమాల విషయంలో కూడా చాలామంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు.
ఇలాంటి దర్శకుడు ఇప్పుడు లేడు అని చాలామంది వాపోతున్నారు.నిజానికైతే ఆయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసి చూసే విధంగా ఉండేవి.వాటి ద్వారా ప్రేక్షకులు కూడా సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేసేవారు.
ఎస్ వి కృష్ణారెడ్డి గారు మళ్లీ అలాంటి సినిమాలు చేయాలని కొంతమంది ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే ఆయన ఇప్పుడు కొన్ని కొత్త ప్రాజెక్టు లను కూడా ఒకే చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
.