తెలుగులో ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss 8 ) మొదలైన విషయం తెలిసిందే.ఈ బిగ్ బాస్ షో చూస్తుండగానే అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది.
అప్పుడే హౌస్ లో మొదటి వారం ఎలిమినేషన్ కూడా పూర్తి అయింది.ఇక మొదటి రోజు నుంచి హౌస్ లో గొడవలు పెట్టుకోవడం, అరచుకోవడం లాంటివి చేస్తూనే కావలసినంత ఎంటర్టైన్మెంట్ ను కూడా అందించారు.
ఇక నామినేషన్స్‌లో అయితే అంతకుమించి రెచ్చిపోయారు.బిగ్ బాస్ 8 తెలుగు సీజన్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
వారిలో మొదటి వారం నామినేషన్స్‌లో విష్ణుప్రియ, బెజవాడ బేబక్క, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, శేఖర్ బాషా ఆరుగురు నామినేట్ అయ్యారు.

రెండు రోజుల పాటు ఈ నామినేషన్స్ సాగాయి.నామినేషన్స్ పూర్తవ్వగానే ఓటింగ్ పోల్ తెరచుకుంది.మొదటి రోజు నుంచి యాంకర్ విష్ణుప్రియకు మంచి ఓటింగ్ నమోదు అయింది.
ఆ తర్వాతి స్థానంలో మణికంఠకు( Manikanta ) ఎక్కువగా ఓట్లు పడ్డాయి.ఇలా విష్ణుప్రియకు( Vishnupriya ) 30 శాతం, నాగ మణికంఠకు 27 శాతం, పృథ్వీరాజ్‌కు 13 శాతం , సోనియా ఆకులకు 10 శాతం, శేఖర్ బాషాకు 10 శాతం ఓటింగ్ నమోదు అయింది.
ఇక చివరిగా అందరికంటే తక్కువగా అదే పది శాతంతో చివరి స్థానంలో నిలిచిన బెజవాడ బేబక్క( Bezawada Bebakka ) ఎలిమినేట్ అయిపోయింది.ఎలిమినేషన్‌ను నాగార్జున ప్రకటించగానే స్టేజీపై బేబక్క ఏవీ వేశారు.

అనంతరం హౌజ్ లో సీత, విష్ణుప్రియ, మణికంఠ ఎమోషనల్ అయ్యారు.అనంతరం హౌజ్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్లను రోడ్డున పడేసేయ్ అని నాగార్జున( Nagarjuna ) చెప్పారు.దాంతో నెగెటివిటీ ఎక్కువగా ఉందన్న కారణంతో సోనియా ఆకుల, అగ్రెషన్ ఎక్కువ అనే రీజన్‌తో పృథ్వీరాజ్, నిఖిల్ వల్లే తాను ఎక్కువగా నెగెటివ్ అయ్యానని అతన్ని, సోలోగా ఉంటూ, కాన్ఫిడెంట్ లేకుండా ఉంటాడని మణికంట పేర్లు చెప్పింది బేబక్క.వారి ఫొటోలను రోడ్డుపై ఉన్న మార్క్ పై పేస్ట్ చేసింది.
అనంతరం బేబక్క హౌజ్‌ను బయటకు వెళ్లిపోయింది.ప్రస్తుతం బేబక్క రెమ్యునరేషన్ గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
మరి ఈ వారం రోజులకు గాను ఆమె ఎంత అందుకుంది అన్న విషయానికి వస్తే.బేబక్క రెమ్యునరేషన్( Bebakka Remuneration ) రోజుకు రూ.21, 428 అని సమాచారం.అంటే వారం రోజులు ఉన్న బేబక్క సంపాదించింది సుమారుగా రూ.1.50 లక్షలు.ఇంకొన్ని రోజులు ఉంటే ఈ అమౌంట్ ఇంకా పెరిగేది.కానీ, బిగ్ బాస్ సాంప్రదాయం ప్రకారం కిచెన్ లోకి దూరి తక్కువ సమయంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌లాగే బేబక్క కూడా అవుట్ అయింది.







