రాజన్న ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ నమూనాలను పరిశీలించి,ఆలయ అభివృద్ది పనులపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆలయ అధికారులతో కలిసి శనివారం ఆలయ ఈఓ గెస్ట్ హౌస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

 A Comprehensive Plan For The Development Of Rajanna Temple, Rajanna Temple, Mla-TeluguStop.com

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు స్వామివారి దర్శనం వేగంగా కల్పించేందుకు, మెరుగైన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఆహ్లాదకర వాతావరణం కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఆలయ అభివృద్ధి పనులను శృంగేరి పీఠం, పండితులు, భక్తుల సూచనల మేరకు చేపట్టి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.గతంలో శృంగేరి పీఠన్ని సందర్శించినపుడు ఆలయ విస్తరణ నమూనాతో రావాలని వారు తెలిపారని విప్ గుర్తు చేశారు.ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.50 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ విస్తరణపై ప్రత్యెక దృష్టి సరించారని తెలిపారు.ఈ క్రమంలో త్వరలో శృంగేరి పీఠన్ని సందర్శించి ఆలయ విస్తరణ పై నమూనాలను శృంగేరి పీఠాధిపతి ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామివారిని కలిసి వారి సూచనలు సలహాల ప్రకారం ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విస్తరణ చేపడుతామని ప్రభుత్వ విప్ స్పష్టం చేశారు.ఆధ్యాత్మికత ఉట్టి పడేలా ఆలయాన్ని విస్తరిస్తామని తెలిపారు.

జీవో నంబర్ 149 రద్దు పై చర్చా

గత ప్రభుత్వ హయంలో వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలలో నూతనంగా 1000 మీటర్ల (కిలో మీటర్ ) పరిధిలో చేపట్టబోయి నిర్మాణాలపై ఇచ్చిన జీవో నెంబర్ 149 రద్దు పై చర్చించారు.ఈ జివో వలన పట్టణంలో ఆలయం పరిసరాల్లో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు.జీవో నంబర్ 149 రద్దుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.వేములవాడ పట్టణంతో పాటు ఆలయ అభివృద్ది పై ప్రభుత్వం ముందుకు పోతుందని స్పష్టం చేశారు.వారి వెంట డి ఈ రఘునందన్, ఏఈఓ లు బ్రహ్మన్న గారి శ్రీనివాస్ ,జి రమేష్ బాబు,ఇంచార్జ్ స్థానాచార్య శ్రీ ఎన్ ఉమేష్ , ప్రధాన అర్చకులు శ్రీ ఈ సురేష్, ఉప ప్రధానార్చకులు సి హెచ్ శరత్ ,ఏఈ రామ్ కిషన్ రావు, ఎడ్ల శివ సాయి, వంశీ మోహన్ తదిరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube