స్పష్టమైన ఎలక్టోరల్ రోల్ ను సిద్దం చేయాలి.. అనురాగ్ జయంతి

స్పష్టమైన ఎలక్టోరల్ రోల్ ను సిద్దం చేయాలి ఎన్నికల సంబంధించిన గైడెన్స్ లు కూల కషంగా చదవాలి.అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలి .

 A Clear Electoral Roll Should Be Prepared Anurag Jayanti , Anurag Jayanti, Vote-TeluguStop.com

పోలింగ్ కేంద్రాలలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి ( Anurag Jayanti )రాజన్న సిరిసిల్ల జిల్లా :రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిఎల్ఓ లు సమర్దవంతమైన, స్పష్టమైన ఎలక్టోరల్ రోల్ ను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫోటో ఎలక్టోరల్ రోల్స్ 2వ ఎస్ఎస్ఆర్ 2023 పై బూత్ స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ….పారదర్శకమైన ఎన్నికల జాబితా తయారు చేయాలని, ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంలో జాగ్రత్తవహించాలని సూచించారు.ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల జాబితాను నిర్దారించాలని అన్నారు.ఫారం -6 , ఫారం -6ఏ  ,ఫారం -6బి  ,ఫారం -7 ,ఫారం -8 ల గురించి ఓటర్లకు బి ఎల్ ఓ లు తెలియజేయాలన్నారు.

ఫారం -8 లో గతంలో ఉన్న కరెక్షన్ ఆప్షన్ తో పాటు షిఫ్టింగ్,పి డబ్యూ ఓ మార్కింగ్ తదితర ఆప్షన్ ల గురించి వివరించాలని చెప్పారు.గరుడ (బిఎల్ఓ) యాప్ లో వివరాల నమోదు సక్రమంగా జరిగేలా చూడాలని, పోలింగ్ స్టేషన్లను సందర్శించి అన్ని సౌకర్యాలు ఉన్నాయా చూసుకోవాలని, ఇంకా ఎవైన అవసరమైతే సమకూర్చాలని తెలిపారు.

ఓటర్లకు( voters ) సమీపంగా పోలింగ్ కేంద్రాలు ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు.చనిపోయిన ఓటర్ల విషయంలో ఖచ్చితంగా మరణ దృవీకరణ పత్రాన్ని పొంది, కుటుంబ సభ్యుల ద్వారా వాకబు చేసిన తరువాతే ఓటరు జాబితా నుండి వివరాలను తొలగించాలన్నారు.

అనాధాలు, ఒంటరి మరియు కూలీ కొసం ఊరురూ తిరిగే వారి వివరాలను కూడా సేకరించి వారి స్థిర చిరునామా ఆధారంగా ఓటరుగా నమోదు చేయాలన్నారు.ఏ ఒక్కరైనా అర్హత ఉండి ఓటరుగా నమోదు చేయకపోతే ….

ఇంత ఎక్సర్సైజ్ చేసి వృధా అని 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని అన్నారు.పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరుగా ఉన్న ప్రతిఒక్కరి ఫోటో, వివరాలు సరిగా ఉండాలన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులు మరియు వృద్దుల కొరకు ర్యాంపులతో పాటు ఇతర మౌళిక సదుపాయాలను ఖచ్చితంగా కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ , ఆర్డీఓ పవన్ కుమార్, తహశీల్దార్ రాజు, అసెంబ్లి లెవల్ మాస్టర్ ట్రైనర్లు, ఇతర ఎన్నికల అధికారులు పాల్గోన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube