జిల్లాలో 84% ఫోన్లు రికవరీతో రాష్ట్రంలో మొదటి స్థానం

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గత కొన్ని రోజుల నుండి పడిపోయిన, దొంగలించబడిన 78 ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అప్పగించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….

 Sircilla District Ranks First In The State With 84 Percent Recovery Of Phones, S-TeluguStop.com

సెల్ఫోన్ పోయిందా.అయితే టెన్షన్ పడవద్దని.

వెంటనే సీఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందర్లోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.జిల్లాలో ఈ రోజు వరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 1200 ఫోన్లు గుర్తించి 1019(సుమారుగా వీటి విలువ కోటి రూపాయలు.

) ఫోన్లు సబంధిత బాధితులకు అందించి 84% తో రాష్టం లో మొదటి స్థానంలో జిల్లా నిలిచిందన్నారు.రాష్ట్రములో కమిషనరేట్స్ కాకుండా మిగితా మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లాలో 1000 పైగా ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

పోన్ దొరికిన బాధితులు మీ బంధువులలో, మీ గ్రామాలలో మీ స్నేహితులలో ఎవరిదైనా ఫోన్ దొంగతనం జరిగిన ఎక్కడైనా పడిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి అనే విషయం పై వారందరికీ అవగాహన కల్పించాలని సూచించారు.సీఈఐఆర్ లో ఎలా నమోదు చేసుకోవాలి కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఈ సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వెతికి పట్టుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

సెల్ఫోన్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ముందుగా ఫిర్యాదు చేయాలి, లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి www.ceir.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ కావాలి.

అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాప్ట్/ స్టోలెన్ అనే లింకై క్లిక్ చేసి, సెల్ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి.

దీంతో పాటు ఏరోజు, ఎక్కడ పోయింది.

రాష్ట్రం, జిల్లా, పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి.చివరిగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో సెల్ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఇదంతా పూర్తయిన తరువాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది.

తద్వారా సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చన్నారు.సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్ 84% రికవరీ చేసి బాధితులకు అప్పగించడం లో కృషి చేసిన ఐ.టి కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్ ,కానిస్టేబుల్ రాజాతిరుమలేష్ లను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డు లను అందజేశారు.పోయిన ఫోను మళ్లీ దొరకదు అనుకున్న ఫోను, పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు జిల్లా ఎస్పీ కి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube