రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సిరిసిల్ల చేనేత కార్మికులు నల్ల విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టే లో ఇమిడే శాలువా మరియు చీర ను తాను స్వయంగా నేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి ( Sri Raja Rajeshwara Swamy) శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి బహుకరించుటకు ఆలయ ఈఓ కె వినోద్ రెడ్డి కి అందజేశారు.
ఆలయ అర్చకులు నేత కార్మికులు నల్ల విజయ్ కుమార్ దంపతులకు ఆశీర్వదించారు.వీరి వెంట ఈఓ సిసి ఎడ్ల శివ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.