యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ):రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వరి సాగుపై రైతులకు వ్యవసాయశాఖ( Agriculture ) ఆధ్వర్యంలో చీడపీడల నివారణ,ఎరువులు – యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై మంగళవారం అవగాహన కల్పించారు.అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా రెండవ దశ రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రెండవ దశలో లక్ష నుండి 1,50 వేలు వరకు రుణం పొందినటువంటి రైతులకు మాఫీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు( Farmers ),తదితరులు పాల్గొన్నారు.