యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం ( Narayanapoor )మండలంలోని ఐదుదోనల్ తండాకు రోడ్డు మార్గం వేయాలని మంగళవారం జిల్లా కలెక్టర్ కి ఎల్.హెచ్.
పి.ఎస్ మండల అధ్యక్షుడు కోర్ర దేవా నాయక్ వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచకొండ పరిధిలో మారుమూల ప్రాంతమైన మా తండాకు రోడ్డు మార్గం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు.
అభివృద్ధి నోచుకోని తండాగా ఉండిపోయిందని ఫిర్యాదు చేయాగా,వెంటనే స్పందించిన కలెక్టర్ హనుమంతు కే.జెండగే త్వరలోనే తండాను పర్యటిస్తానని హామి ఇచ్చారని తెలిపారు.