సూర్యాపేట జిల్లా:జిల్లాలో( Suryapet District ) రెండో విడత 26,376 మంది రైతు కుటుంబాలకు 250.07 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగినట్లు జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత( Additional Collector BS Latha ) తెలిపారు.మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy ),శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,స్పీకర్ గడ్డం ప్రసాద్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర మంత్రులు, సిఎస్ శాంతకుమారి తదితరులతో కలిసి రైతులకు రెండో విడత లక్షన్నర రూపాయల రుణమాఫీ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరం నుండి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత, తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ చాగంటి అనసూయ,ఆర్డీఓ వేణుమాధవ్ రావు, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి,ఎల్.
డి.ఎం బాపూజీ, డిసిఒ పద్మజ,వివిధ బ్యాంకు మేనేజర్లు, సహకార సంఘాలు, రైతులతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత 56,217 రైతు కుటుంబాలకు 282.7 8 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగినట్లు తెలిపారు.మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన రెండో విడత రుణమాఫీలో 26,376 మంది రైతు కుటుంబాలకు 250.07 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందని పేర్కొన్నారు.సంబంధిత శాఖల అధికారులు రైతు రుణమాఫీలో భాగస్వాములై విజయవంతం చేశారని, ఇంకొద్ది క్షణాల్లో రైతుల ఖాతాలలో రుణమాఫీ( Runamafi ) జమ అవుతాయని పేర్కొన్నారు.మొదటి, రెండో విడతలో ఏదైనా సాంకేతిక కారణాలవల్ల రుణమాఫీ జరగని రైతులు మండల,డివిజన్ వ్యవసాయ అధికారులు సంప్రదించాలని సూచించారు.
కొంతమంది రైతుల యొక్క ఆధార్ కార్డు నెంబరు ఆనుసందానమైన ఫోన్ నెంబరు తప్పుగా ఉండటం వల్ల రుణమాఫీ నిధులు జమకావడం లేదని,అట్టివారు ఎఈఓని కలిసినట్లైతే వారి యొక్క సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు.వ్యవసాయ అధికారులు రైతులను తప్పకుండా వారి సమస్యను వెంటనే పరిష్కరించి పంపాలని, ప్రభుత్వం అందిస్తున్న రుణమాఫీ అందరికీ అందేలా చూడాలని,రైతు అంటే మన ఇంట్లో మనిషిగా భావించి అందరికీ రుణమాఫీ జరిగేలా చూడాలన్నారు.
డివిజన్ స్థాయిలో గాని, మండలాల్లో గాని,ఎలాంటి పొరపాట్లు జరిగినా వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని రావాలన్నారు.జిల్లాలోని అన్ని రైతువేదికలలో రైతు రుణమాఫీ కార్యక్రమం జరుగుతుందని,రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు.
అనంతరం జిల్లా రైతు రుణమాఫీ చెక్కును రైతుల చేతుల మీదుగా రిలీజ్ చేశారు.