సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం( Gruha Jyothi Scheme )లోని 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అర్హులకు అందడం లేదని సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని కొందరు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏప్రిల్ నెలలో తీసిన బిల్లులో 200 యూనిట్లలోపు వాడకం జరగకున్నా జీరో బిల్( Zero Bill ) రాకుండా ఇంతకుముందు లాగే వందల్లో బిల్లు వస్తుందని,దీనితో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ కు తాము దూరమైతున్నామని వాపోతున్నారు.
ఈ విషయమై మండల విద్యుత్ కేంద్ర కార్యాలయం,ఎంపిడిఓ ఆఫీస్ చుట్టూ మూడు నెలలుగా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని,ఇదే అదునుగా భావించి విజిలెన్స్ అధికారులు 1కేటగిరీ ఉన్న మీటర్లను 2 కేటగిరీకి మారుస్తూ అంతా మా ఇష్టం అన్నట్లుగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ నెలలో నాకు రూ.1065 బిల్లు వచ్చిందని లింగంపల్లికి చెందిన బొద్దని రమణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.నేను కూలి పని చేసుకుంటూ జీవిస్తానని,నాకు 4201700800 సర్వీస్ నెంబరు గల 1 కేటగిరీ విద్యుత్ మీటర్ ఉందని,నేను గృహజ్యోతి పథకానికి అప్లై చేసుకున్న అయినా నాకు కరెంట్ బిల్లు వందల్లో వస్తుంది.
ఈ విషయమై మండల విద్యుత్ అధికారులను సంప్రదించగా నా మీటర్ 2 కేటగిరి అని అంటున్నారు.ఎలాంటి బిజినెస్లు లేవు,కూలీ పని చేసుకొనే నాకు 2 కేటగిరీ ఎలా ఉంటుంది?ఇప్పటికైనా అధికారులు స్పందించి నాకు జీరో బిల్లు ఇప్పించగలరు.ఉదే విషయమై నూతనకల్ మండల విద్యుత్ ఏఈ ప్రణయ్ కోరగా ప్రతి లబ్ధిదారునికి జీరో బిల్లు అందేలా చర్యలు తీసుకుంటామని,మండలంలో వివిధ గ్రామాల నుంచి కేటగిరి -2 మీటర్లపై కంప్లైంట్స్ వచ్చాయని,వచ్చిన కంప్లైంట్స్ పై క్షేత్రస్థాయిలో విచారణ చేసి త్వరలో జీరో బిల్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.