తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యాచో స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న గోపీచంద్( Gopichand ) తన కెరియర్ లో మంచి విజయాలను సాధించాడు.అయితే తను ఎన్ని విజయాలు సాధించాడో అంతకంటే ఎక్కువ అతనికి ప్లాపులు కూడా వచ్చాయి.
అందువల్లే ఆయన ఇప్పటికి కూడా మీడియం రేంజ్ హీరోగానే కొనసాగుతున్నాడు.లేకపోతే ఆయన స్టార్ హీరో అయ్యేవాడు చాలామంది గోపీచంద్ విషయంలో చాలాసార్లు అభిప్రాయాలు తెలియజేస్తుంటారు.
ఇక మొత్తానికైతే గోపీచంద్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం ప్లాప్ ల్లో ఉండడం అనేది ఒక వంతుకు ఆయన అభిమానులకు బాధను కలిగించే విషయమనే చెప్పాలి.ఇక రీసెంట్ గా వచ్చిన భీమా సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో ఆయన మరోసారి డీలా పడిపోయాడు.
ఇక గోపీచంద్ తన కెరియర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారనే విషయం చాలా మందికి తెలియదు.

అందులో ప్రభుదేవా డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన పౌర్ణమి సినిమా( Pournami Movie ) గోపీచంద్ చేయాల్సింది.కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమాలోకి ప్రభాస్( Prabhas ) రావడం జరిగింది.అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది.
ఇక ఇలాంటి ప్లాప్ సినిమ నుంచి గోపిచంద్ తప్పించుకున్నప్పటికీ, మరో హిట్ సినిమాను కూడా తను చేజేతులారా వడిలేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే.అందులో ముఖ్యంగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్( Kalyanram ) హీరోగా వచ్చిన పటాస్ సినిమాని( Patas Movie ) మొదట గోపీచంద్ హీరోగా తెరకెక్కించాలనే ప్రయత్నం చేశారు.

కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమాని కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కించాల్సి వచ్చింది.ఇక మొత్తానికైతే గోపీచంద్ తనదైన రీతిలో సినిమాలు చేసి సక్సెస్ సాధించాలనుకున్నప్పటికీ ఆయన అనుకున్న విధంగా ఆయన సినిమాలైతే సక్సెస్ కావడం లేదు.దాంతో ఆయన కెరీర్ అనేది ప్లాపుల్లో ఉందనే చెప్పాలి.ఇక ఇప్పుడు వచ్చే రెండు మూడు సినిమాలతో కనక ఆయన సక్సెస్ సాధించకపోతే ఇండస్ట్రీ నుంచి ఆయన ఫేడ్ అవుట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది.
అందువల్లే ఇప్పుడు ఆయన చేసే సినిమాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తుంది…
.







