అకాలవర్షానికి దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి:మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట జిల్లా: శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.సూర్యాపేట జిల్లాలోని అనేక ప్రాంతాలలో వరి పంట బాగా దెబ్బతిన్నదని,అకాల వర్షంతో పాటు ఈదురు గాలులు విపరీతంగా వీచటం మూలంగా మామిడి,నిమ్మ పంటలు తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 Farmers Affected By Untimely Rain Should Be Supported, Mallu Nagarjuna Reddy ,su-TeluguStop.com

అనేక గ్రామాలలో భారీ వర్షం మూలంగా ఐకెపి కేంద్రాల్లో పోసిన ధాన్యం కొట్టుకుపోయిందన్నారు.ఐకెపి కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిన కారణంగా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలన్నారు.

అధికారులు ఐకెపి కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే ఎగుమతి,దిగుమతి చేసే దగ్గర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,దాని మూలంగా అకాల వర్షాలు వచ్చినప్పుడు ఐకెపి కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన వరి ధాన్యం ప్రకృతి వైపరీత్యాలకు గురికావాల్సి వస్తుందన్నారు.అన్ని ఐకెపి కేంద్రాల్లో గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని,కాంటాలు వేసిన వెంటనే రైతుల ఎకౌంట్ లో డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

అధికారులు తక్షణమే ఐకెపి కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి తడిసిన,రంగు మారిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube