ఆచార్య చాణక్యుడు( Chanakya ) ఎన్నో విషయాల గురించి తెలిపారు.అందులో ప్రేమ గురించి కూడా బోధించారు.
మరి ఈ ప్రేమ ఎలా ఉండాలి? ఎలా ఉంటే ఆ జంటలు బాగుంటాయి అన్నది కూడా తెలిపారు.ఒకసారి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ బంధమేనా కొనసాగించే వారిపై ఆధారపడి ఉంటుంది.ఒకవేళ ప్రేమికుల మధ్య సంబంధం బలహీనంగా ఉంటే వారు విడిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు.
అయితే బంధం బలంగా ఉండాలంటే కొన్ని పాటించాల్సి ఉంటుంది.వాటిని పాటిస్తే టెన్షన్ అసలు ఉండదని చెబుతున్నారు.
వ్యక్తి తన భాగస్వామిని కచ్చితంగా గౌరవించాలి.అంతేకాకుండా ఇతరుల ముందు కించపరచకూడదు.

అలా చేయడం వలన వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే కాకుండా గౌరవాన్ని కూడా కోల్పోతారని తెలిపారు చాణక్యుడు.దీని వలన ప్రేమలో గొడవలు ఏర్పడి ఆ ప్రేమ విఫలం కూడా అవుతుంది.కాబట్టి ప్రేమలో ఉన్న ప్రతి జంట కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి.ఇక ఎవరినైనా ప్రేమిస్తే ముందుగా తమకున్న ఈగోను పక్కన పెట్టాలి.దీనివలన అశాంతి ఏర్పడి ప్రేమను కోల్పోతారు.కాబట్టి అహాన్ని పక్కన పెట్టాల్సిందే.
ఇక ఎవరినైనా ప్రేమిస్తే వారిపై విశ్వాసంగా ఉండాలి.అయితే నమ్మకం లేని చోట ప్రేమ ఉండదని మన అందరికీ తెలిసిందే.
కాబట్టి నమ్మకమే బలం.ప్రేమలో నమ్మకం ఉంటేనే ఆ ప్రేమ బంధం కూడా చాలా గట్టిగా ఉంటుంది.

దీని వలన ఎంతటి కష్టమైన సవాలు అయినా సులభంగా ఆ ప్రేమ ఎదుర్కోగలదు.ఇక మరోవైపు నమ్మకాన్ని అనుమానించే సంబంధం తేలికపాటి గొడవతో విచ్చిన్నమవుతుంది.సంబంధం( Love Relationship ) లో స్వేచ్ఛ ఉండడం చాలా అవసరం.స్వేచ్ఛ ఉన్న సంబంధాల కంటే పరిమితులు ఉన్న సంబంధాలు అస్సలు బలంగా ఉండవు.ఇక స్వేచ్ఛ లేని సంబంధాలు కొంతకాలం తర్వాత వారి నుండి వారు విసుగు చెందడం ప్రారంభిస్తారు.దీని వలన బంధం తెగిపోతుంది.
కాబట్టి ఈ నియమాలన్నీ పాటిస్తే మీ ప్రేమ బంధం బలపడుతుంది.