37 ఏడిషన్ ఒలింపిక్స్ డే రన్...!

సూర్యాపేట జిల్లా: ఆటలు ఆరోగ్యానికే కాదు సమాజానికి మేలు చేకూరుస్తాయని నమ్మే నాయకుడు సీఎం కేసీఆర్‌ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ప్రపంచ ఒలింపిక్ రన్ దినోత్సవాన్ని పురస్కరంచుకుని జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఒలింపిక్‌ రన్‌ గ్రాండ్ సక్సెస్ అయింది.

 37th Edition Of Olympic Run In Suryapet District, 37th Edition Of Olympic Run ,s-TeluguStop.com

వందలాది మంది పాల్గొన్న ఒలింపిక్ రన్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.కొత్త బస్టాండ్ వద్ద నుంచి ప్రారంభమైన పరుగు ఎంజీ రోడ్,శంకర్ విలాస్ సెంటర్ మీదుగా టాంక్ బండ్ వరకు 2 కి.మీల మేర సాగింది.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్ద కాలంలో క్రీడా రంగంలో స్పష్టమైన మార్పు వచ్చిందన్నారు.

ఆటలకు అందలమిస్తున్న ప్రభుత్వం దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు.స్టేడియాలు,క్రీడా ప్రాంగణాల నిర్మాణం అందులో భాగమేనన్నారు.

క్రీడా అభివృద్ధిలో దేశానికి దిక్సూచి తెలంగాణ అని, ప్రతి ఒక్కరూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు.క్రీడల వల్ల దేహదారుడ్యంతో పాటు స్నేహ సంబంధాలు మెరుగుపడతాయన్నారు.చిన్న తనం నుంచే క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని సూచించారు.గ్రామ స్థాయి నుండే వివిధ విభాగాల్లో మంచి ప్రతిభ కనబరచి రాష్ట్ర,జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

తెలంగాణలో క్రీడలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నాయన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి పథంలో దూసుకెళుతూ దేశానికి దిక్సూచిలా నిలుస్తున్నాయన్నారు.

మిగతా రంగాల్లో వలే క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తూ దేశంలో మొదటి స్థానంలో నిలుపాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనలతో ప్రభుత్వం ముందుకెళుతున్నది అన్నారు.

గడిచిన దశాబ్ద కాలంలో రాష్ట్ర క్రీడారంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నదని, క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు స్టేడియాల నిర్మాణం, గ్రామీణ క్రీడా ప్రాంగణాలను భారీ ఎత్తున ఏర్పాటు చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో సూర్యపేట జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ కన్వీనర్ నామ నరసింహ రావు, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి,స్పోర్ట్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్,డి.టి.డి.వో శంకర్, కమిటీ సభ్యులు శ్రీనివాస్, మారిపెద్ది శ్రీనివాస్, నాగిరెడ్డి,లింగయ్య, వీరయ్య,రాంచంచర్ గౌడ్,మల్లేష్,వెంకటేశ్వర్లు ఇతర అధికారులు క్రీడాకారులు అన్ని అసోసియేషన్ సంఘాలు వారు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube