నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ సద్దలచెరువు వద్ద నిర్వహించే గణేష్ నిమజ్జనం ప్రదేశాన్ని బుధవారం జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించారు.నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని,లైటింగ్ ఏర్పాటు చేయడం, భారీకెడ్స్,క్రేన్ల వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

 District Sp Inspected The Immersion Site-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణ మినీ ట్యాంక్ బండ్ వద్ద,జిల్లాలో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు.జిల్లాలో గణేష్ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని,ఉత్సవ కమిటీలు, భక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు.

శోభాయాత్రలో ఉపయోగించే వాహనాలు కండిషన్ లో ఉండాలని,అన్ని అనుమతి పత్రాలు కలిగుండాలని, పిల్లలను ఎవరిని శోభాయాత్ర వాహనంపై ఎక్కించరాదని,ప్రతీ ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట డిఎస్పి నాగభూషణం,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్సైలు శ్రీనివాస్,సాయిరాం,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube