మోడీ,కేడిలపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాట స్ఫూర్తిగా కదలాలి...!

కేంద్రంలో మోడీ(Narendra Modi),రాష్ట్రంలో కేడి సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేయడానికి కాంగ్రెస అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేస్తున్న పోరాట స్పూర్తితో కాంగ్రెస్ శ్రేణులు(Congress Leaders),ప్రజలు ఐక్యంగా కదలాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి( TPCC state secretary Patel Ramesh Reddy) అన్నారు.సూర్యాపేట(Suryapet) నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కొనసాగిస్తున్న పాదయాత్రలో భాగంగా శనివారం ఆయన చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం, బండమీది చందుపట్ల గ్రామాల్లో పర్యటించారు.

 Rahul Gandhi's Fight Against Modi And Kd Should Be Inspired...!-TeluguStop.com

ఈ సందర్భంగా పాదయాత్రకు హాజరైన ప్రజలనుద్దేశించి అయన మాట్లాడుతూ భూమి కోసం,ప్రజల విముక్తి కోసం పోరాడిన దేవులపల్లి వెంకటేశ్వర్ రావుకి జన్మనిచ్చిన గ్రామ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక పాలకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ(Telangana) సెంటిమెంటుతో రెండుసార్లు గెలిపించినా జగదీష్ రెడ్డి ఏనాడైనా ప్రజల సమస్యల పరిష్కారం కోసం గ్రామాలకు వచ్చాడా అని ప్రశ్నించారు.సూర్యాపేట నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం మా ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పోరాడుతామని, ప్రజలకు ఏలాంటి సమస్య ఉన్నా ముందుంటానని భరోసా ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube