సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామంలో నీళ్ళు లేక ఎండిపోతున్న వరి పంటను రైతులు పశువులను,గొర్లను మేపుతున్న దృశ్యం కన్నీళ్లు పెట్టిస్తుంది.
యాసంగిలో ఎస్సారెస్పీ జలాలపై ఆధారపడి అప్పులు చేసి పొలాలు వేస్తే నీళ్ళు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.