సూర్యాపేట జిల్లా: గత కొంతకాలంగా పిల్లలమర్రి శివాలయం అర్చకులుగా పనిచేసిన నందీశ్వర్ శర్మ అలియాస్ నందయ్యను అర్చకులుగా తొలగించినట్లు పిల్లలమర్రి శివాలయాల చైర్మన్ గవ్వ వెంకటకృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయనపై పలు ఆరోపణలతో రావడంతో తొలగించినట్లు చెప్పారు.
ఈ విషయమై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేసినట్లు పేర్కొన్నారు.శివాలయాల్లో పూజలు,శివరాత్రి ఉత్సవాలలో దాతల భాగస్వామ్యంకై పూర్తి వివరాలకు చైర్మన్ ఫోన్ నెంబర్ 9182581579 సంప్రదించాలని కోరారు.







