సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డు దగ్గరలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు శుక్రవారంపరిశీలించారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చాంబర్,జిల్లా కలెక్టర్,జిల్లా అదనపు కలెక్టర్ల గదుల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు.ఛాంబర్లలో సుందరీకరణ,లైటింగ్ ఏర్పాట్లపై గుత్తేదారితో చర్చించారు.
అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తూ పనులు వేగంగా జరిగేలా చూడాలని,ఈనెల 24వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానున్నందున పనుల వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలన్నారు.
అనంతరం సూర్యాపేట పట్టణంలోని మార్కెట్ యార్డ్ దగ్గరలో నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ సముదాయాన్ని పరిశీలించి మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డికి తగు సూచనలు చేశారు.
సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ప్రజలకు రైతులకు వ్యాపారులకు అన్ని మౌలిక సౌకర్యాలతో సిద్ధం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ నరసింహ నాయక్,ఈఈ యాకూబ్, ఏఈఈ ప్రీతి,గుత్తేదారు, సిబ్బంది పాల్గొన్నారు.