సూర్యాపేట జిల్లా: జిల్లాలోని మున్సిపల్ పరిధిలో వివిధ వ్యాపార వర్గాలకు సంబంధించిన ఫ్లేక్సీలు అలాగే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్లెక్సీలు, సైన్ బోర్డ్స్ ఏర్పాటుకు ముందస్తు మున్సిపల్ శాఖ అనుమతులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( S Venkat Rao ) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పర్యావరణానికి హాని కలిగించే రీతిలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేయడం సరైనది కాదని, ఎలాంటి అనుమతులు లేకుండా పెట్టిన ప్లెక్సీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేయనైనదని,ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేస్తే మున్సిపల్ చట్టం( Municipal Act ) ప్రకారం చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.అలాగే నోటీలు జారీ చేసిన వారికి ఇచ్చిన మూడు రోజుల గడువులోపు ప్లెక్సీలు తొలలించాలని తెలిపారు.