రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దు బేషరతుగా రైతు పంటను కొనుగోలు చేయాలి:ఏ.ఐ.కె.ఎం.ఎస్.రాష్ట్ర నాయకులు కొత్తపల్లి శివకుమార్

సూర్యాపేట జిల్లా:రైతు పండించిన పంటను కొనమంటే కేంద్రంపైన రాష్టం,రాష్టంపైన కేంద్రం కుంటి సాకులతో ఒకరిపై ఒకరు వారి రాజకీయ స్వార్థం కోసం రైతులను బలి చేయకుండా,ఎలాంటి షరతులు లేకుండా రైతు పండించిన పంటను కొనుగోలు చేయాలని అఖిల భారత రైతుకూలి సంఘం రాష్ట్ర నాయకులు కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై రాజకీయాలు మాని పంటలను కొనాలని ఏ.

 Don't Sacrifice Farmers For Politics Farmers Should Buy Unconditionally: Aik-TeluguStop.com

ఐ.కె.ఎం.ఎస్,న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో అంబెడ్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాజకీయ పబ్బం గడుపుకోవాడానికి,ధర్నాలు,రాస్తారోకోలు చేస్తూ, కేంద్రంపైన పోరాటం చేస్తున్నామని అంటున్నారు.కేంద్ర ప్రభుత్వం మాది ఏమి తప్పులేదు మొత్తం రాస్ట్రానిదే అంటూ పీయూష్ గోయల్ రాష్ట్ర బిజెపి నాయకులు గగ్గోలు పెడుతున్నారు.

వీళ్ళ పోరాటాలు నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు ఉన్నట్టు ఉన్నదే తప్ప వేరేది ఏమీలేదన్నారు.ప్రతి పక్షాలు,వామపక్ష విప్లవ పార్టీలు రైతుల కోసం,ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తే అక్రమ అరెస్టులు,కేసులు పెట్టే మీరు ఈ రోజు రైతుల గూర్చి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.

ఇకనైన ఈ డ్రామాలు మాని రైతుల పంట కొనేందుకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించి ఎలాంటి షరతులు లేకుండా ప్రతి గింజా కోనాలని డిమాండ్ చేశారు.ఆ తరువాత కేంద్రంపైన అన్ని పార్టీలు,రైతు సంఘాలతో కలిసి పోరాడాలని సూచించారు.

ఈకార్యక్రమంలో ఏ.ఐ.కె.ఎం.ఎస్.అధ్యక్షలు రామన్న,పి.ఓ.డబ్ల్యూ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రేణుక,ఐ.ఎఫ్.టి.యు.జిల్లా కన్వీనర్ రామోజీ,జహంగీర్.పి.డి.యెస్.యు.జిల్లా అధ్యక్షులు సింహాద్రి,పి.వై.ఎల్.జిల్లా నాయకులు కొత్తపల్లి వేణు,వెంకటమ్మ,పంతం యాకయ్య,బయ్య వెంకన్న,గంగులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube