ఆఫీసుల్లో లంచ్ బ్రేక్ లాగా హస్తప్రయోగానికి బ్రేక్ ఇవ్వాలి అంట

ఈ గ్లోబలైజేషన్ పుణ్యమా అని లక్షలమందికి కార్పొరేటు కంపెనీల్లో ఉద్యోగాలు దొరుకుతున్నాయి.కాని అదే గ్లోబలైజేషన్ మూలాన కంపెనీల మధ్య పోటి పెరిగిపోయింది.

 There Should Be Masturbation Breaks In Office – Psychologist Suggests-TeluguStop.com

నిమిషం పని ఆగిపోయిన కోట్లలో నష్టపోయెంత పోటి ఉంటుంది కొన్ని కంపెనీల మధ్య.ఇలాంటి పోటిలో నుజ్జునుజ్జు అవుతున్నది ఎవరు అంటే ఉద్యోగాలు చేసేవారే.

యాభై వేలు, లక్ష, లక్షన్నర, రెండు లక్షలు .జీతాలు అబ్బో అనిపించేలా ఉంటాయి కాని ఏం లాభం? కుక్కలా పనిచేయాలి.ఒకే కంప్యూటర్ ముందు కూర్చొని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకోవాలి.రాత్రిపూట కుటుంబంతో కొంత సమయం గడుపుదామన్నా కుదరదు.ఏడెనిమిది గంటల చాకిరి చేసి, మరో గంట, రెండు గంటలు ప్రయాణం చేసి ఇంటికొస్తే, శరీరంలో అలసట తప్ప ఇంకేమి ఉంటుంది.రాత్రి పడుకున్నా ఆఫీసు పనే గుర్తుకు వస్తే స్ట్రెస్ తప్ప ఇంకేం ఉంటుంది.

అందుకే నాటింగ్హామ్ ట్రెంట్ యునివర్సిటి సైకాలజీ లెక్చరర్ మార్క్ సార్జంట్ ఒక విచిత్రమైన ఉపాయాన్ని సజెస్ట్ చేస్తున్నారు.అదేమిటంటే … ఆఫీసుల్లో ఎలాగైతే లంచ్ బ్రేక్, కాఫీ బ్రేక్ ఉంటాయో, అలాగే మాస్తార్బెషణ్ బ్రేక్ .అంటే హస్తప్రయోగానికి కూడా బ్రేక్ ఇవ్వాలంట.ఎందుకు అంటే హస్తప్రయోగం ఒత్తిడి నుంచి రిలీఫ్ ని ఇస్తుంది కాబట్టి.

హస్తప్రయోగం వలన శరీరానికి కలిగే లాభాల గురించి మనకు తెలియనిది కాదు.ఇది ఎండార్ఫిన్స్, ఆక్సిటాసిన్ హార్మోన్స్ ని విడుదల చేసి శరీరానికి హాయిని ఇస్తుంది.

మెదడుని ఉత్తేజిత పరుస్తుంది.ఒత్తిడిని తగ్గిస్తుంది.

అందుకే ఆఫీసుల్లో హస్తప్రయోగం కోసం ఇటు మగవారికి, అటు ఆడవారికి బ్రేక్ ఇవ్వాలని మార్క్ సర్జాంట్ అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ సజెషన్ మీద మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది.

ఆలోచన బాగానే ఉన్నా, హస్తప్రయోగం కోసం కొంతమంది ఎక్కువ సమయం వెచ్చిస్తారని, ముఖ్యంగా స్త్రీలకి కొంత సమయం కావాలని, ఆలాంటపుడు ఆఫీసులో వర్క్ నేమ్మదిస్తుందని కొందరు వాదిస్తోంటే, ఇదో చెత్త ఆలోచన అని, అంతమంది ఆ పని ఆఫీసులో చేస్తే శుభ్రత గంగలో కలిసినట్టే అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube