సూర్యాపేట జిల్లా:ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని తుమ్మల పెన్ పహాడ్ గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో నెమ్మికల్ గ్రామానికి చెందిన వినోద్ (22) మృతి చెందారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.