సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండలం( Nuthankal ) లింగంపల్లి గ్రామంలో మేకల లింగమల్లు భూమిలో నుండి ఎస్ఆర్ ఎస్పీ కెనాల్ పోయింది.దానికి ప్రభుత్వం నుండినష్టపరిహారం చెల్లించారు.
అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకుడు ఎస్ఆర్ఎస్పీ కాలువ పూడ్చి భూమిని అక్రమంచాడు.ఇదే విషయాన్ని మాచనపల్లి గ్రామ రైతులు(Farmers ) ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోగా కబ్జాదారుడికే వత్తాసు పలికారు.
ప్రస్తుతం కాలువ ద్వారా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదని,బోర్లలో నీళ్లు లేక పొలాలు ఎండి పోతున్నాయని రైతులు వాపోతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ తీసి నీళ్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదే విషయమై ఎమ్మార్వోను వివరణ కోరగా ఎస్సారెస్పీ కాలువలు( SRSP canal ) కబ్జా చేస్తే ఎంతటి వారి వీపేక్షించేది లేదని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని,ఆ కాలువపై దర్యాప్తు జరుగుతుందని,రెండు రోజులలో సమస్య పునరుద్దించబడుతుందని తెలిపారు
.