సాధారణంగా ప్రతి ఒక్కరి వంట గదిలో తప్పనిసరిగా వెల్లులి పాయలు ఉండడం మనం గమనించే ఉంటాము. బిర్యానీ దగ్గర నుంచి ఏ కర్రీకి అయిన మంచి రుచి, సువాసన రావాలంటే వెల్లుల్లి ఉండాలిసిందే.
వంటలలో మాత్రమే కాకుండా మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా వెల్లుల్లి ముఖ్య పాత్ర పోషిస్తుంది.వెల్లుల్లి వలన అనేక రకాలు అయిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.సాధారణంగా మనం వెల్లుల్లిపాయ తొక్కు తీసేసి మన వంటల్లో వాడుతూ ఉంటాము.
అలా వెల్లుల్లి తొక్కు పనికిరాదు అనుకుని చెత్తలో పారేస్తాము.కానీ.
మీరు ఈ విషయాలు కనుక తెలుసుకుంటే వెల్లుల్లి పాయతో పాటు వెల్లుల్లి పొట్టును కూడా జాగ్రత్తగా దాచుకుంటారు తెలుసా.
వెల్లుల్లి పొట్టు వలన కూడా మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి.
మరి ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. పాదాల వాపుతో ఇబ్బంది పడేవారు కొంచెం గోరువెచ్చిని నీటిలో వెల్లుల్లి పొట్టు వేసి మీ పాదాలను ఆ నీటిలో ముంచి కొంచెం సేపు అలానే ఉండనివ్వాలి.
అలా చేయడం ద్వారా మీ పాదాల వాపు తగ్గుతుంది.అలాగే చలి, జ్వరం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే వెల్లుల్లి పొట్టును నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగడం వలన చలి జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చు.
చర్మంపై వచ్చే దురదను తగ్గించడానికి వెల్లుల్లి పొట్టును నీటిలో వేడి చేసి ఆ నీటిని దురద వచ్చే ప్లేస్ లో రాస్తే దురద తగ్గుతుంది.వెల్లుల్లి పొట్టు ఆరోగ్యానికే కాదు అందాన్ని కాపాడడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.జుట్టు సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు వెల్లుల్లి పొట్టును పేస్ట్ గా చేసుకున అందులో కొంచెం నిమ్మరసం చుక్కలు కలిసి తలకు బాగా పట్టించాలి.
అలా చేయడం వలన జుట్టు సమస్యలు తొలగిపోవడంతో పాటు తలలో పేలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి.అలాగే మీ ఇంట్లో మొక్కలు కనుక పెంచుతున్నట్లయితే ఆ మొక్కల కుండీల్లో వెల్లుల్లి తొక్కలు వేయడం వలన అవి ఆరోగ్యంగా పెరుగుతాయి.
ఇన్నీ ఉపయోగాలు ఉన్న వెల్లుల్లి తొక్కను పారేసేముందు ఒక్కసారి అలోచించి పారేయండి.