కేసులు పెండింగ్ పెట్టకుండా సామాన్యులకు సత్వర న్యాయం చేయాలి: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే

సూర్యాపేట జిల్లా: కేసులు పెండింగ్లో ఉంచకుండా సామాన్యులకు సత్వర న్యాయం జరిగే విధంగా న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా కోదాడలో సబ్ కోర్టు,అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించిన అనంతరం నూతన కోర్టు భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.

 Justice Should Be Given To Common People Without Pending Cases Chief Justice Of-TeluguStop.com

ఈ సందర్భంగా హై కోర్టు చీఫ్ జస్టిస్ మాట్లడుతూ వివాహ సంబంధాల వివాదాలతో న్యాయం కోసం కోర్టుకొస్తున్న మహిళలను పదేపదే తిప్పకుండా సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు.పెండింగ్ కేసులను తగ్గించేందుకే అదనపు కోర్టులను మంజూరు చేస్తున్నామని చెప్పారు.

న్యాయవాదులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకొని న్యాయవ్యవస్థకు వన్నె తేవాలన్నారు.కోదాడ బార్ అసోసియేషన్ న్యాయ వ్యవస్థ ప్రతిష్టతకు చేస్తున్న కృషిని అభినందించారు.

హైకోర్టు జడ్జిలు వినోద్ కుమార్,లక్ష్మణ్, విజయసేనారెడ్డి,పుల్లా కార్తీక్ లు మాట్లాడుతూ సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులకు వృత్తి నైపుణ్య విలువలను అందించాలని సూచించారు.భవిష్యత్ తరాలు న్యాయవాద వృత్తిని స్వీకరించే విధంగా ఆదర్శంగా నిలవాలన్నారు.

అదనపు కోర్టులు కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడతాయన్నారు.నూతన భవన నిర్మాణాన్ని కోదాడ బార్అసోసియేషన్ కాలయాపన చేయకుండా త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు.

కోదాడలో కోర్టుల భవన నిర్మాణాలు చారితాత్మకంగా నిలవాలన్నారు.బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవబతిని నాగార్జున మాట్లాడుతూ కోదాడ కోర్టు నిర్భవన నిర్మాణానికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కోదాడ బార్ అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

కోదాడకు అదనపు కోర్టులు మంజూరు చేయడంతో కక్షిదారులు దూరప్రాంతాలకు వెళ్లకుండా కోదాడలోనే న్యాయం పొందే అవకాశం కలిగిందన్నారు.కోదాడకు అడిషనల్ జిల్లా కోర్టును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా నాలుగు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో రాణిస్తున్న సుధాకర్ రెడ్డి, రాధాకృష్ణమూర్తిలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.జిల్లా జడ్జి రాంగోపాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు,ఎస్పీ రాహుల్ హెగ్డే,హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లా నాగేశ్వరరావు,కొల్లి సత్యనారాయణ,కోదాడ జూనియర్ సివిల్ జడ్జి భవ్య, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గాలి శ్రీనివాస్ నాయుడు,ప్రధాన కార్యదర్శి సాధు శరత్ బాబు,జాయింట్ సెక్రటరీ సీతారామరాజు, కోశాధికారి పాష,కార్యదర్శి రాజు,సూర్యాపేట డిఎస్పి రవి, కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల,మునిసిపల్ కమిషనర్ రమాదేవి,సీనియర్, జూనియర్ న్యాయవాదులు,

పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.కోదాడలో అదనపు కోర్టుల ప్రారంభానికి, కోర్టుకు నూతన భవన నిర్మాణ శంకుస్థాపనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు వచ్చిన న్యాయమూర్తులకు కోదాడ బార్అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పూర్ణకుంభంతో వేద పండితుల మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు.కోర్టుల ప్రారంభోత్సవం అనంతరం వేదిక వద్ద హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి హైకోర్టు న్యాయమూర్తులకు పుష్పగుచ్చాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం సభ కార్యక్రమాలు ముగిసిన తర్వాత వేదికపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తులకు మెమెంటోలు అందజేసి పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube