గతం కంటే పెరిగిన మేళ్లచెరువు శివాలయ ఆదాయం

సూర్యాపేట జిల్లా: మహాశివరాత్రి రోజు ప్రారంభమైన మేళ్లచెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు కన్నుల పండువగా జరిగి గురువారం పవళింపు సేవతో ముగిశాయి.బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీలను సహాయ కమిషనర్ దేవాదాయ శాఖ కార్యాలయ అధికారి యన్.

 Income Of Mellacheruvu Shivalayam Temple Has Increased, Mellacheruvu Shivalayam-TeluguStop.com

నిఖిల్ ఆధ్వర్యంలో లెక్కించారు.

భక్తులు సమర్పించిన కానుకల హుండీలు,వివిధ సేవా టికెట్లు,కొబ్బరికాయలు, షాపుల కిరాయిలు ద్వారా రూ.40,07,720, ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి గుజ్జుల కొండారెడ్డి తెలిపారు.గత సంవత్సరం కంటే రూ.10,55,129 అధికంగా వచ్చినట్లు చెప్పారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డెవలప్ ఫండ్ ద్వారా భక్తుల సౌకర్యం కోసం 50 లక్షల నిధులు మంజూరు చేశారని ఆలయ అధికారులు వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube