సూర్యాపేట జిల్లా:జిల్లాలోని ఈ వేసవిలో త్రాగునీటి సమస్యలు రాకుండా చూడాలని అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలసి ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీటి సమస్యలు ఎక్కడ కూడా ఉత్పన్నం కాకుండా సంబంధిత అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుండి ఎక్కువగా ప్రజలు భూసమస్యలపై వస్తున్నాయని అన్నారు.
భూ సమస్యలపై 29,డిపిఓ 6,డిఆర్డీఏ 3, విద్యాశాఖ 4 అలాగే ఇతర శాఖలకు సంబంధించి 4 మొత్తం 46 దరఖాస్తులు అందాయని తెలిపారు.అట్టి దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వేసవికాలం మొదలైనందున గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఉపాధి పనులు ఎక్కువగా కల్పించాలని,వారి ఆర్ధిక బలోపేతానికి చేయూత నివ్వాలని సూచించారు.అన్ని గ్రామ పంచాయతిలలో ఉన్న నర్సరీలు,పల్లె ప్రకృతిలలో మొక్కల రక్షణకు నిరంతరం నీటి సౌకర్యం కల్పించాలని అన్నారు.
ముఖ్యoగా అన్ని పంచాయతిలలో ఇంటి పన్ను నూరు శాతం వసూలు అయ్యేలా చూడాలని అన్నారు.ప్రజావాణి కార్యక్రమంలో హాజరుకానీ అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.
*నీటిని పొదుపుగా వాడాలి*
జిల్లాలో నీటి విలువలపై ప్రజలలో ఆకాగహన కల్పించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.జిల్లాలో భూగర్భ జలాలు,నిల్వలు మరియు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా భూగర్భ జలాలు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన భూగర్భ జలాల నిలువలు,వినియోగం తదితర వివరములతో రూపొందించిన పుస్తకాన్ని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు,జిల్లా అధికారుల సమక్షంలో కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నీటి విలువలు తగ్గకుండా ప్రజలలో నీటి వాడకంపై అవగాహన కల్పించాలని అన్నారు.
భూగర్భ జలాల అంచనా బేస్ సంవత్సరం ప్రకారం జిల్లాలో 23 మండలాల్లో 14 మండలాలు నీటివినియోగంలో స్టేట్ క్యాటగిరి,8 మండలాలు సెమి క్రిటికల్ క్యాటగిరి అలాగే ఒక మండలం అతి వినియోగ క్యాటగిరి కింద ఉన్నట్లు మొత్తము భూగర్భ జలాల వినియోగం స్టేట్ క్యాటగిరి కింద ఉన్నట్లు అంచనా వేయడం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఏఓ రామారావు నాయక్,భూగర్భ జలాల శాఖ అధికారి టి.సుధాకర్ రెడ్డి,సంక్షేమ అధికారులు అనసూయ, శంకర్,జ్యోతిపద్మ,ఏఓ శ్రీదేవి,పర్యవేక్షకులు సుదర్శన్ రెడ్డి,పులి సైదులు తదితరులు పాల్గొన్నారు.