సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ను మూడు రోజుల క్రితం మార్త కృష్ణమూర్తిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు డిసిసి చెవిటి వెంకన్న ఉత్తర్వులు జారీ చేయడం సరైనది కాదని సస్పెన్స్ కు గురైన మార్త కృష్ణమూర్తి అన్నారు.శనివారం తన సస్పెన్స్ ను ఖండిస్తూ ఆయన మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,మూడు రోజుల క్రితం నన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
నేను కొంతమంది యువకులను కాంగ్రెస్ పార్టీలో హైదరాబాదులోని స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చాను,దీనిని నేను వేరొక పార్టీలో చేర్చినట్టు పార్టీ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ నన్ను సస్పెండ్ చేయడం చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు.నా సొంత ఖర్చులతో పార్టీ బలోపేతం కోసం పాటుపడుతున్నాను.
గ్రామాలలో ఏ ఒక్క కార్యకర్త అధైర్య పడకుండా కాపాడుకుంటూ వస్తున్నానని,గ్రామంలో 85 వీది లైట్లు,రెండు సిసి రోడ్లు ఒక మినరల్ వాటర్ ప్లాంట్,100 కెవి ట్రాన్స్ఫార్మర్ మొదలగునవి ఎంపీ నిధుల నుండి తీసుకువచ్చి గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నానని తెలిపారు.స్థానిక సీనియర్ నాయకులు చామకూరి వెంకన్న చనిపోతే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకువచ్చి రెండు లక్షల ఆర్థిక సాయం చేయించానని,నేను ఎంపీ వర్గానికి చెందిన వాడిని అయితే రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కార్యక్రమాలు మరియు ఇతర నాయకులు అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్,గుడిపాటి నరసయ్య, వడ్డేపల్లి రవి లాంటి వారితో పార్టీ కార్యక్రమాలు ఎలా నిర్వహించానని ప్రశ్నించారు.
ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు తెలుసు నేను కాంగ్రెస్ పార్టీ మనగడకు పనిచేస్తున్నానని,పార్టీలో నాకు వచ్చిన ఆదరణ చూడలేకనే నన్ను సస్పెండ్ చేసి పార్టీ విచ్చిన్నాన్ని కోరుకుంటున్నారని అని ఆరోపించారు.ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నేను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని,కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మద్దిరాల గ్రామ పార్టీ అధ్యక్షులు నల్లమాస ఉపేందర్ మాట్లాడుతూ కనీసం నోటీసులు జారీ చేయకుండా వివరణ కోరకుండా సస్పెండ్ చేయడం హేయమైన చర్య అన్నారు.ఈ కార్యక్రమంలో ముకుందాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు సవడం శీను,కుక్కుడం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దెల నరేష్,రాముల, అనంతుల మల్లయ్య,సుంచు వెంకన్న, సుంచు విజయ్,కసనబోయిన శేఖర్, బొందేకోల సిల్వ రాజ్,కసనబోయిన లింగమూర్తి,సుల్తాన్ నరేష్,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.