సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది.పట్టణంలోని ఓ హోటల్ లో కలుషిత ఆహారం తిని సుమారు 17 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
ఆహారం తిన్న వెంటనే వాంతులు, విరోచనాలు కావడంతో బాధితులను ఆస్పత్రికి తరలించారు.వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో బాధితులను హైదరాబాద్ కు తరలించారు.







